హోమ్ క్వారంటైన్ లో గౌతమ్ తో కలిసి టెన్నిస్ ఆడుతున్న సూపర్ స్టార్ మహేష్…..!!

0
811
Superstar Mahesh Game Night With Son Gautam

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, తనకు సినిమా షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఫ్యామిలీ తో గడపడానికి ఇష్టపడుతుంటారు అని గతంలో పలుమార్లు చెప్పడం జరిగింది. ఇక తనకు ఏ మాత్రం ఖాళీ దొరికినా కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేసే అలవాటున్న మహేష్, ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడంతో షూటింగ్స్ అన్ని బంద్ అయిన కారణంగా, కొద్దిరోజులుగా ఇంట్లోనే ఫ్యామిలీ తో కలిసి గడుపుతున్నారు.

ఇకపోతే నేడు కుమారుడు గౌతమ్ తో కలిసి హ్యాపీ గా, జాలిగా తాను టెన్నిస్ ఆడుతున్న వీడియో ని మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు మహేష్. ఇక ప్రస్తుతం ఈ వీడియో పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. ఒకరకంగా ఈ లాక్ డౌన్ వలన పిల్లలతో మహేష్ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారని , వారితో మా అనుబంధం మరింత పెరిగిందని ఇటీవల ఆయన సతీమణి నమ్రత తెల్పడం జరిగింది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here