“మారెమ్మ” సినిమా చూశాను. రూటెడ్, రస్టిక్‌గా ఉంది. నాకు చాలా నచ్చింది. మాధవ్ ట్రాన్స్‌ఫర్మేషన్ బావుంది. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ

0
5
Maaremma Pre Release Event
Maaremma Pre Release Event

“మారెమ్మ” సినిమా చూశాను. రూటెడ్, రస్టిక్‌గా ఉంది. నాకు చాలా నచ్చింది. మాధవ్ ట్రాన్స్‌ఫర్మేషన్ బావుంది. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. రియల్ ఇన్సిడెంట్స్‌పై తీశారు. చాలా రూటెడ్‌గా ఉంది. తెలంగాణ మైసాపురం బ్యాక్‌గ్రౌండ్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. డెఫినెట్‌గా జనాలకి బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్రశాంత్ విహారి పాటలు చాలా బాగున్నాయి. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే డీఓపీ ప్రశాంత్ వర్క్ చాలా బాగుంది. ఈ సినిమా నిర్మాతలు మయూర్ కుశాల్‌కి మంచి సక్సెస్, మంచి పేరు, డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్లు మరిన్ని మంచి సినిమాలు తీయాలి. దీపా తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడారు. వికాస్ అందులో చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. తనకి ఆల్ ది వెరీ బెస్ట్. నాగరాజుకి ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశారు. ఇలాంటి సబ్జెక్టు ఎంచుకోవడం, అది మాధవ్‌తో చేయడం చాలా బాగుంది. తమ్ముడు మాధవ్ బాగున్నాడు.(నవ్వుతూ) తన ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. తనకి ఆల్ ది వెరీ బెస్ట్. సెప్టెంబర్ 10న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఈ సినిమా చూస్తారని, యంగ్ టాలెంట్‌ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. జై సినిమా.

హీరో మాధవ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. రవితేజ గారి అభిమానులందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి రవితేజ గారిని చూసే పెరిగాను. ఆయన నా ఫస్ట్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య. మీ అందరికీ ట్రైలర్, టీజర్ ఎంత బాగా నచ్చిందో సినిమా కూడా అంతే బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో మీ అందరికీ పరిచయం అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఇందులో ఒక మనిషికి దున్నపోతు ఉన్నా హ్యూమన్ ఎమోషన్ చూస్తారు. డైరెక్టర్ గారు అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే మా నిర్మాతలు మయూర్, కుశాల్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. దీప అద్భుతంగా నటించింది. వికాస్ విలన్ క్యారెక్టర్‌లో ఇరగదీశాడు. అలాగే ప్రశాంత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 10న థియేటర్స్‌లో కలుద్దాం. జై మారెమ్మ.

డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మాధవ్ రవితేజ గారిని అనుసరిస్తూ సినిమా ప్రయాణం మొదలుపెట్టారు. తొలి సినిమాతోనే చాలా రూటెడ్ కంటెంట్ తీసుకున్నారు. ఈ కంటెంట్ చూస్తుంటే నాకు ‘జల్లికట్టు’ సినిమా గుర్తొచ్చింది. చాలా నేచురల్‌గా ఈ కంటెంట్ ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్ దీప బాలు మాట్లాడుతూ.. “మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన రవితేజ గారికి చాలా థాంక్యూ.ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మాధవ్ ఎంతో క్రమశిక్షణతో అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మ్ అయ్యారు. తనకు చాలా పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది .

యాక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. రవితేజ గారి సినిమాలో నేనింతే నాకు చాలా పర్సనల్‌గా కరెక్టే సినిమా. ఎందుకంటే నాకు కూడా సినిమా తప్పితే ఇంకేమీ తెలియదు. మాకు స్ఫూర్తినిచ్చిన రవితేజ గారికి థాంక్యూ. మాధవ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమా మనసుల్ని తాకుతుంది.

డైరెక్టర్ మంచాల నాగరాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 10న ‘మారెమ్మ’ జాతర మొదలు కాబోతుంది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే ప్రజలు చాలా బాగా కనెక్ట్ అవుతారు. 2006 టైమ్‌లైన్‌లో జరిగే స్టోరీ ఇది. అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ వేడుకకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన రవితేజ గారికి థాంక్యూ. ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 10న థియేటర్స్‌లో కలుద్దాం.

నిర్మాత మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. “రవితేజ గారికి వెల్‌కమ్. ‘ఇరుముడి’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న రవితేజ గారికి కంగ్రాజులేషన్స్. దర్శకుడు ‘మారెమ్మ’ కథ చెప్పినప్పుడు మా ఊరి కథ అనిపించింది. మా ప్రొడక్షన్ టీమ్‌కి థాంక్యూ. అందరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ‘మారి’ పాత్రలో మాధవ్ గారు చాలా అద్భుతంగా నటించారు. సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్‌కి వచ్చి చూసి సినిమాని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నాకు చాలా నమ్మకం ఉంది”

మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మంచి పాటలు రాసే అవకాశం కల్పించిన దర్శకుడికి, అలాగే మా నిర్మాతలకు ధన్యవాదాలు. మాధవ్ గారు ఈ సినిమాలో ‘మారి’ పాత్రలో అద్భుతంగా నటించారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది”

మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ.. “ఈ సినిమాకి కావాల్సిన ఎనర్జీ మొత్తం అమ్మవారే ఇచ్చారు. మాధవ్ గారు తన తొలి చిత్రానికే ఎంతో అద్భుతమైన సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల వద్దకు వెళుతుంది. అంత మంచి కంటెంట్. తప్పకుండా ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారని నమ్ముతున్నాను”

డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ.. మా నిర్మాతలకు, దర్శకుడికి ధన్యవాదాలు. చాలా అద్భుతమైన ప్రాజెక్టులో ఎంచుకున్నారు. మాధవ్ గారి కటౌట్ స్క్రీన్ మీద అదిరిపోతుంది. మా కెమెరా డిపార్ట్‌మెంట్‌కి, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది. తప్పకుండా అందరూ థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను.

ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here