‘ధంధా’ రివ్యూ

0
6
Dora Sai Teja
Dora Sai Teja "Dhandha" Review

రివ్యూ: ‘ధంధా’

నిర్మాణ సంస్థ : ఛాయ్ షాట్స్
దర్శకత్వం / సహ-రచయిత : ఆదిత్య దేవులపల్లి
కథ : విజయ్ కుమార్
ఛాయాగ్రహణం : అశ్విన్ లెనిన్
సంగీతం : రిషి ఎమ్
కూర్పు : జగదీష్ గౌడ్
కళా దర్శకత్వం : సంజన కంచాల

నటీనటులు : దొర సాయి తేజ, అక్షర నల్ల, నితిన్ ప్రసన్న, కిరణ్ కుమార్ కామ్తం, సూరి కే చాప్లిన్, విక్రమ్ దేవాకి

కథాంశం 
అరవింద్ (దొర సాయి తేజ) 22 ఏళ్ల తెలివైన బి.టెక్ విద్యార్థి. డబ్బు, అధికారం సంపాదించాలనే బలమైన కోరిక అతనిది. తరగతి గదిలో కన్నా హైదరాబాద్ డార్క్ సైబర్ క్రైమ్ ప్రపంచంలోనే తన తెలివితేటలకు అసలైన విలువ దక్కుతుందని అరవింద్ గ్రహిస్తాడు. చిన్న చిన్న ఆన్‌లైన్ మోసాలతో ప్రారంభమైన అతని ప్రయాణం.. ఫిషింగ్ స్కామ్‌లు, కాల్ సెంటర్లు, బ్లాక్‌మెయిల్‌లు మరియు గ్యాంగ్‌స్టర్ పాలిటిక్స్ వైపు ఎలా దారితీసింది? డిజిటల్ నేరాల నెట్‌వర్క్‌ను శాసించే స్థాయికి అరవింద్ ఎలా ఎదిగాడనేదే ఈ సిరీస్ కథ.

నటీనటుల ప్రదర్శన 
దొర సాయి తేజ (అరవింద్): యూట్యూబర్ గా ఇప్పటికే మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న దొర సాయి తేజ, ఈ సిరీస్‌లో అరవింద్ పాత్రలో జీవించేశారు. కేవలం పాపులారిటీ మాత్రమే కాకుండా, తనలో ఎంతటి నటుడు ఉన్నాడో ఈ నెగెటివ్ ఛాయలున్న ఆంటి-హీరో పాత్రతో నిరూపించారు. ప్రశాంతంగా ఉంటూనే మైండ్ గేమ్‌లు ఆడటం, ఆర్యోగెంట్ ల్యాంగ్వేజ్ మెయింటైన్ చేయడం, డైలాగ్ డెలివరీలో చూపిన పరిణతి ఆకట్టుకుంటాయి. నటుడిగా దొర సాయి తేజ రీ-ఇన్వెన్షన్ ఈ షోకి బిగ్గెస్ట్ అసెట్. ఒక క్యాలిక్యులేటెడ్, డెవిలిష్ యాంటీ-హీరోగా అతడు చూపించిన పరిణతి తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి యంగ్ లీడ్ దొరికాడనే నమ్మకాన్ని ఇస్తుంది.

నితిన్ ప్రసన్న (ఆదిత్య సింగ్): అరవింద్ పాత్రకు పోటీగా నిలిచే ఆదిత్య సింగ్ పాత్రలో నితిన్ ప్రసన్న కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రెండో సీజన్‌పై ఆసక్తిని పెంచేలా ఆయన పాత్ర సాగుతుంది.

ప్రకాష్ ఠాకూర్:గ్యాంగ్‌స్టర్ పాత్రలో అతిశయోక్తి లేని, బ్యాలెన్స్డ్ అభినయంతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు 
దర్శకత్వం – ఆదిత్య దేవులపల్లి: తొలి సిరీస్‌తోనే ఆదిత్య తన అద్భుతమైన డైరెక్షన్ స్కిల్స్ చూపించారు. వర్టికల్ ఫార్మాట్‌ను ఒక హద్దుగా అనుకోకుండా, ప్రతీ ఎపిసోడ్ చివరిలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ కథనాన్ని నడిపిన తీరు ప్రశంసనీయం. డైరెక్టర్ ఆదిత్య దేవులపల్లి టేకింగ్ లో ఎక్కడా తొలి ప్రయత్నంలా అనిపించదు. కంటెంట్ ని ఎక్కడా అనవసరంగా లాగకుండా, ప్రతి సీన్ ని ఒక పాయింట్ తో ఎండ్ చేయడం ఆయన రచనా ప్రావీణ్యానికి నిదర్శనం.

రచన – విజయ్ కుమార్ & ఆదిత్య దేవులపల్లి:సైబర్ నేరాలు, క్రిమినల్ సైకాలజీని ఎంతో లోతుగా రీసెర్చ్ చేసి రాసుకున్న స్క్రీన్‌ప్లే ఈ సిరీస్‌కు ప్రధాన బలం. అరవింద్ నేరుగా ప్రేక్షకులతో మాట్లాడే (4th Wall Breaks) సన్నివేశాలు కథలో బాగా కుదిరాయి.

సంగీతం – రిషి M: బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని తీవ్రతను, ఆటిట్యూడ్‌ను రెట్టింపు చేసింది. ప్రతీ ఎపిసోడ్‌కు ఈ BGM సరికొత్త ఊపునిచ్చింది. మెక్సికన్, టర్కిష్ ఇన్ స్ట్రుమెంట్స్ తో రిషి అందించిన మ్యూజిక్ తెలుగులో రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ సౌండ్ ట్రాక్స్ లో ఒకటి.

ఛాయాగ్రహణం – అశ్విన్ లెనిన్: హైదరాబాద్ నేర ప్రపంచాన్ని కలర్‌ఫుల్‌గా, అదే సమయంలో డార్క్ మూడ్‌లో చూపించడంలో అశ్విన్ కెమెరా పనితనం మెప్పిస్తుంది.

ముగింపు
“దొర సాయి తేజ” మొదటి ప్రయత్నంలో అందరిని మెప్పించాడు !! 64 నిమిషాల వ్యవధిలో ‘ధంధా’ ఒక పక్కా స్టైలిష్, గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్.  తప్పక చూడాల్సిన సిరీస్!

రేటింగ్

3.25/5

DHANDHA Review
DHANDHA Review

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here