‘#KJQ’ డైరెక్టర్ కిరణ్ గారి డ్రీం ప్రాజెక్ట్. సినిమా పెద్ద విజయం సాధించి ఆయనకు గొప్ప ట్రిబ్యూట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

0
5
#KJQ Pre Release Event
#KJQ Pre Release Event

‘#KJQ’ డైరెక్టర్ కిరణ్ గారి డ్రీం ప్రాజెక్ట్. సినిమా పెద్ద విజయం సాధించి ఆయనకు గొప్ప ట్రిబ్యూట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా #KJQ (కింగ్ – జాకీ – క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ‘దసరా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు KK(కిరణ్ )కి ఇది చివరి చిత్రం. ఆయన క్రియేటివిటీ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది ఒక నివాళిగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన  థియేట్రికల్ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ “అందరికీ నమస్కారం. ప్రతి సినిమా ఈవెంట్‌కు వచ్చినప్పుడు ఒక ఎక్సైట్మెంట్, ఒక భయం ఉంటాయి. సినిమా ఎలా ఆడుతుంది? ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనే ఆలోచన ఉంటుంది. కానీ ఈ రోజు ఈ వేడుకలో ఆ ఫీలింగ్ పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఈ వేడుక మా దర్శకుడు కిరణ్ గారు లేకుండా జరుగుతోంది. చాలా బాధగా వుంది. కిరణ్ గారు విజనరీ ఫిల్మ్‌మేకర్. నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చారు. సుధాకర్ గారు, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నాకు హోమ్ బ్యానర్‌లాంటివి. వారి నిర్మాణంలో ఇది నాకు మూడో సినిమా. కిరణ్ గారికి ఈ సినిమాను అంకితం చేయాలనే ఉద్దేశంతో సుధాకర్ గారు ఎంతో కష్టపడ్డారు. ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్, డీఓపీ నగేష్‌తో పాటు ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేశారు. వాళ్లందరికీ ధన్యవాదాలు. శశి ఈ సినిమాతో నటుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో అందరూ ఎంత అద్భుతంగా నటించారో సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది ఎంతో ప్రత్యేకమైన సినిమా. అందరికీ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. ఈ సినిమా కూడా స్నేహం గురించి చెబుతుంది. ఆగస్టు 7న థియేటర్లలో చూసి తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

హీరో శశి ఓదెల మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. రవి గారికి, సందీప్ గారికి, శ్రీకాంత్ అన్నకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి కొత్త కథను నిర్మించినందుకు, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. దీక్షిత్‌తో నాకు నాలుగేళ్లుగా స్నేహం ఉంది. తనతో కలిసి ఈ సినిమాతో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. యుక్తి కూడా చాలా ఎమోషనల్ పాత్ర చేసింది. కిరణ్ అన్న ప్రతి క్షణం తాను నమ్మినదే చేశాడు. తాను నమ్మిన దాని కోసం చివరి వరకు నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు మనతో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా ఆయనకు ఒక ట్రిబ్యూట్‌లా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.”

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ: “ఈ సినిమా కిరణ్ గారి డ్రీమ్. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనను చూస్తుంటే ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ ని చూసినట్టుగా అనిపించెడి. ఎంతో అంకితభావంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కిరణ్ గారికి ఒక గొప్ప నివాళి నిలిచి, పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.”

నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ: “ఈ వేడుకలో కిరణ్‌ను చాలా మిస్ అవుతున్నాను. ఆగస్టు 7న అందరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడండి. ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడా నిరాశపరచదు.”

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ: ఈ సినిమా టైటిల్‌లోనే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రతి డిపార్ట్‌మెంట్ అద్భుతంగా పనిచేసింది. కిరణ్‌కు అందరూ కలిసి గొప్ప ట్రిబ్యూట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేసినట్టుగా అనిపించింది. దీక్షిత్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ పెర్ఫార్మర్. అలాగే ఈ సినిమాతో పరిచయం అవుతున్న శశికి ఆల్ ది వెరీ బెస్ట్. ట్రైలర్ చూస్తుంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై చాలా పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. దర్శకుడు కిరణ్ లేకపోయినా సుధాకర్ గారు ఎన్నో ఇబ్బందులు దాటుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమాను అందరూ సపోర్ట్ చేసి కిరణ్‌కు ఒక గ్రాండ్ ట్రిబ్యూట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.”

హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. కిరణ్ గారి వల్లే నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మా ప్రొడ్యూసర్స్‌కు ధన్యవాదాలు. దీక్షిత్, శశితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా థ్యాంక్యూ. ‘రంగబలి’ సినిమాతో ఈ ప్రొడక్షన్ హౌస్‌లో హీరోయిన్‌గా పరిచయమయ్యాను. మళ్లీ అదే బ్యానర్‌లో ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 7న సినిమా విడుదల అవుతోంది. ఇది మా దర్శకుడు కిరణ్ గారికి ఒక ట్రిబ్యూట్. ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా చేశాం. తప్పకుండా మీరందరూ థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.”

దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. కిరణ్‌తో నాకు 20 ఏళ్ల స్నేహం ఉంది. మేమిద్దరం కలిసి పనిచేశాం. ఈ రోజు ఇక్కడికి వస్తుంటే తనతో గడిపిన ప్రయాణం మొత్తం కళ్ల ముందు కనిపించింది. తను మనల్ని వదిలి వెళ్లడానికి రెండు రోజుల ముందు కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తాడని అనుకోలేదు. తన ఆలోచనలు చాలా రాడికల్‌గా ఉండేవి. ఎవరికి తలవంచే వ్యక్తి కాదు. ఈ సినిమా కథ నాకు తెలుసు. సుధాకర్ గారు ఈ సినిమాను నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. కిరణ్‌కు కష్టం వచ్చిన ప్రతిసారి ఆయన ఎంతో అండగా నిలిచారు. నిజంగా ఇండస్ట్రీలో ఒక నిర్మాత ఇంతగా చేయడం అరుదు. మా స్నేహితుడి కోసం ఆయన చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. ఈ సినిమాలో నటించిన శ్రీకాంత్  బ్రదర్‌ శశి చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. కిరణ్ చివరి కోరిక కూడా అదే. దయచేసి ఆగస్టు 7న థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి. మీకు నచ్చితే మరో పది మందికి చెప్పండి. అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్.”

దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ: “ఈ సినిమాను నేను మొదటి నుంచి ఫాలో అవుతున్నాను. ప్రతి అప్‌డేట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై నా అంచనాలు మరింత పెరిగాయి. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా ఈ సినిమా చాలా ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను.”

సంగీత దర్శకుడు పూర్ణచంద్ర తేజస్వి మాట్లాడుతూ: “ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు కేకే గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడి విజన్‌కు తగ్గట్టుగా మేమంతా పనిచేశాం. ఇది రెగ్యులర్ సినిమా కాదు. చాలా యూనిక్ కథ. ఈ సినిమాతో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.” ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

నటీనటులు: దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా

సాంకేతిక బృందం:
బ్యానర్ – SLV సినిమాస్
నిర్మాత – సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం – KK
సినిమాటోగ్రఫీ – నాగేశ్ బనెల్
సంగీతం – పూర్ణచంద్ర తేజస్వి
ఎడిటర్ – శ్రవణ్ కటికనేని
ప్రొడక్షన్ డిజైనర్ – శ్రీకాంత్ రామిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శేఖర్ యలమంచిలి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here