ప్రస్తుతం కరోనా మహమ్మారి దెబ్బకు ఇతర దేశాలతో పాటు మన దేశం మొత్తం కొన్ని వారాలుగా లాక్ డౌన్ అవడంతో దాదాపుగా అన్ని రంగాలు కూడా ఎన్నో ఇబ్బందుల్లో కూరుకుపోవడం జరిగింది. ఆటు ఇంటి నుండి బయటకు రాలేక, చేయడానికి పనులు లేక ఎందరో ప్రజలు ఆర్ధికంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వారిని ప్రభుత్వాలు ఆదుకుంటున్నటప్పటికీ, మేము కూడా ఇటువంటి సమయంలో వారిని ఆదుకుంటాం అంటూ పలు రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు తమ మంచి మనసుతో ముందుకు వస్తూ విరాళాలు అందిస్తున్నారు.
ఇక ఇప్పటికే తమిళ సినిమా పరిశ్రమ నుండి నటుడు, దర్శకుడైన రాఘవ లారెన్స్ కొద్దిరోజుల క్రితం రూ.3 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే నేడు చెన్నై లోని చెంగల్ పేట, తిరువళ్లూరు, కాంచీపురం సినిమా డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ కు మరొక రూ.15 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు లారెన్స్. కాసేపటి క్రితం తమిళ దర్శకుడు ఆ ప్రాంత డిస్ట్రిబ్యూటర్ సంఘం అధ్యక్షుడు అయిన టి రాజేందర్ ని కలిసి లారెన్స్ ఆ విరాళం తాలూకు చెక్కుని అందచేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ విధంగా తన దయార్ద్ర హృదయంతో పలుమార్లు ఆదుకోవడానికి ముందుకు వచ్చిన లారెన్స్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు….!!