తొలివారంలో 5 కోట్ల 27 లక్షల గ్రాస్‌ సాధించిన హుషార్‌ పిట్టలు

0
3
“Husharu Pittalu Thanks Meet
“Husharu Pittalu Thanks Meet

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని హుషార్‌ పిట్టలు మరోసారి నిరూపించింది: నిర్మాత వెంకట్‌ యాదవ్‌

తొలివారంలో 5 కోట్ల 27 లక్షల గ్రాస్‌ సాధించిన హుషార్‌ పిట్టలు

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హుషార్‌ పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేశాయి. ఆగస్టు 15న ఈ చిత్రం అనూహ్యమైన ఓపెనింగ్స్‌తో, అద్భుతమైన మౌత్‌టాక్‌తో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తొ బ్లాక్‌బస్టర్‌ విజయంగా నిలిచింది. తొలివారంలో ఈ చిత్రం 5 కోట్ల 27 లక్షల గ్రాస్‌ను సాధించి విజయవంతంగా రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ థ్యాంక్స్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో

దర్శకుడు బిక్షు మాట్లాడుతూ ”చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాల మధ్యలో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అవుతోంది. రెండవారంలో కూడా అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే రోజు మా సినిమా థ్యాంక్స్‌ మీట్‌ జరగడం ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో చిరంజీవితో సినిమా తీస్తాను. నా దగ్గర కథ రెడీగా ఉంది. హుషార్‌ పిట్టలు సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి నా లాంటి కొత్త దర్శకుడిని ప్రోత్సాహించడం ఎంతో ఎనర్జీని ఇచ్చింది. భవిష్యత్‌లో మరిన్ని యూత్‌ఫుల్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను అన్నారు.

హీరో అన్షు మాట్లాడుతూ ” నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్క్షతలు. ఈ సినిమాను ప్రేక్షకులకు రీచ్‌ కావడానికి కారణమైన సురేష్‌బాబు, బెక్కెం వేణుగోపాల్‌ కు థ్యాంక్స్‌. పెద్ద సినిమాల మధ్యలో విడుదలైన మా సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టింది. యూత్‌ మా సినిమాకు బ్రహ్మారథం పడుతున్నారు. పేరెంట్స్‌ కూడా మా సినిమా చూస్తున్నారు. నా తొలిసినిమానే ఇంత పెద్ద సక్సెస్‌ కావడం ఆనందంగా ఉంది. మా సినిమాలో ఉన్న సందేశాన్ని అందరూ బాగా రీసీవ్‌ చేసుకుంటున్నారు. త్వరలోనే ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తాను’ అన్నారు.

నిర్మాత కె.వెంకట్‌ యాదవ్‌ మాట్లాడుతూ ” నన్ను నమ్మి ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి సినిమా చూసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. తొలి సినిమాతోనే నిర్మాతగా మంచి గుర్తింపు వచ్చింది. పెద్ద సినిమాల మధ్యలో మా చిన్న సినిమా హుషార్‌ పిట్టలు విడుదలై తొలివారంలో 5 కోట్ల 27 లక్షల గ్రాస్‌ను వసూలు చేసి రెండోవారంలోకి అడుగుపెట్టడం హ్యాపీగా ఉంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఓ మంచి సినిమా చూశామని చెబుతుంటే ఆనందంగా ఉంది. సినిమాను చూసి సినీ విశ్లేషకులు ఎంతో జెన్యూన్‌ రివ్యూ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి కనెక్ట్‌ అవుతున్నారు. ఇది చాలా రియలిస్టిక్‌ కథ. అందరూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. రెండు తెలుగు, రాష్ట్రాల్లో మా సినిమాను ఆదరిస్తున్నారు. ఈ సినిమాను హిట్‌ చేసిన ప్రేక్షకులే మా స్టార్స్‌. అర్హతను బట్టి దేవుడు మనకు అన్నీ ఇస్తాడు అనేది నేను నమ్ముతున్నాను’ అన్నారు.

బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ” కొత్తవారితో తెరకెక్కించిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌తో ప్రారంభమై నేటి హౌస్‌ఫుల్‌ వసూళ్లతో కొనసాగడం గొప్ప విషయం. కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని ఈ సినిమాను మరోసారి ప్రూవ్‌ చేసింది. ఈ సినిమా ప్రభంజనమైన ఓపెనింగ్స్‌తో ఎక్స్‌పెక్ట్‌ చేయని విధంగా తొలివారంలో 5 కోట్ల 27 లక్షలు సాధించింది.ఇది అక్షరాల నిజమైన కలెక్షన్స్‌.. ఇది జెన్యూన్‌ హిట్‌. ఈ రోజు.. కొత్త సినిమాలు విడుదలైన హుషారు పిట్టలు సినిమా 200 సెంటర్స్‌లో ఆడుతోంది. ఇప్పటి వరకు 5 లక్షల మంది ఈ సినిమాను చూశారు. భవిష్యత్‌లో ఈసినిమా ప్రేక్షకులకు మరింత రీచ్‌ అవుతుంది. ఈ సినిమా టాక్‌ తెలుసుకుని దిల్‌రాజు గారు అభినందించారు. దర్శకుడు వినాయక్‌ గారు కూడా విషెస్‌ తెలియజేశారు. సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు.అన్నారు.

హీరోయిన్‌ వాసవి గణేషన్‌ మాట్లాడుతూ ” సినిమా సక్సెస్‌ సాధించడమే కాకుండా రెండో వారంలోకి సక్సెస్‌ఫుల్‌గా అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ఆడియన్స్‌ ఓ మంచి సినిమాను ఆదరించి మా కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చారు. భవిష్యత్‌లో మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here