కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు గారు అందరినీ నవ్విస్తారు. సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్.. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు: డైరెక్టర్ జానకి రామ్ మారెళ్ల

0
2
Comrade Kalyan Director Janakiram Marella
Comrade Kalyan Director Janakiram Marella

కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు గారు అందరినీ నవ్విస్తారు. సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్.. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు: డైరెక్టర్ జానకి రామ్ మారెళ్ల

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ జానకి రామ్ మారెళ్ల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

టైటిల్ ‘కామ్రేడ్ కళ్యాణ్’.. కానీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లా అనిపిస్తోంది?
కామ్రేడ్ కళ్యాణ్ టైటిల్ కథ నుంచే వచ్చింది. శ్రీ విష్ణు గారి బలం ఎంటర్‌టైన్‌మెంట్. అది ఇందులో స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక సమస్యలో ఉన్న వ్యక్తి అటువైపు వెళ్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.

చాలా రిస్కీ లొకేషన్స్ కనిపిస్తున్నాయి?
చాలా రిస్కీ లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. స్టోరీ ప్రకారం డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్లాం. మంగళూరు దగ్గర ఆగుంబె ఫారెస్ట్‌కి వెళ్లాం. ప్రపంచంలోనే ఎక్కువ కోబ్రాలు ఉండే ఫారెస్ట్ అది. యూనిట్‌లో అందరం చాలా రిస్కులు తీసుకున్నాం. షూటింగ్ తొలి రోజే ఒక పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాను. మా టీం అందరూ చాలా కష్టపడ్డారు.

కామెడీ కథ కదా? అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు?
ఇప్పుడు ఆడియన్స్ ఏదైనా ఒరిజినాలిటీ చూస్తున్నారు. ఒక కథని ఒరిజినల్‌గా చూడటానికి, కథకు తగ్గ వరల్డ్‌లో చూడటానికి ఇష్టపడుతున్నారు. ప్రేక్షకులకు మంచి వినోదం ఇవ్వడానికే ఇంత రిస్క్ తీసుకున్నాం. నిర్మాత కిట్టు గారు, కోన వెంకట్ గారు, మా హీరో శ్రీ విష్ణు గారి ప్రోత్సాహంతోనే ఇది సాధ్యపడింది.

ఈ కథ ఆలోచన ఎప్పుడు పుట్టింది?
నేను 2014 నుంచి బాబీ గారి దగ్గర పనిచేస్తున్నాను. అప్పటి నుంచి కోన గారు పరిచయం ఉంది. ‘పులిమేక’ అని ఒక వెబ్ సిరీస్ చేశాను. అప్పుడు ఆయనకి ఈ ఆలోచన చెప్పాను. ఆయనకి నచ్చింది. తర్వాత శ్రీ విష్ణు గారికి చెప్పాను. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది.

శ్రీ విష్ణు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
శ్రీ విష్ణు గారు చాలా సపోర్ట్ చేశారు. ఒక షాట్ కోసం మూడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేశాం. ఆయన ప్రతి దశలో నాకు సపోర్ట్‌గా ఉన్నారు. ఆయన సినిమాని చాలా ప్రేమిస్తారు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటారు. ఆయన కథని నన్ను నమ్మారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టానని భావిస్తున్నాను. శ్రీ విష్ణు గారి సపోర్ట్‌ని మర్చిపోలేను. ఆయన నాకు దేవుడితో సమానం.

-శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ ఫుల్‌ ఫన్ గా ఉంటుంది. ఆయన చాలా ఇంప్రొవైజ్ చేశారు. ఆయన పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది.

మీ నేపథ్యం గురించి?
-మాది ఈస్ట్ గోదావరి జిల్లా రామచంద్రపురం. 2010లో చెన్నై వెళ్లాను. అక్కడే సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. ఒక సీరియల్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. ఆ తర్వాత సముద్రఖని గారి దగ్గర పని చేశాను. ఆయన నన్ను చాలా ప్రోత్సహించారు. తర్వాత మనోజ్ గారి దగ్గరికి వచ్చాను. ‘మిస్టర్ నోకియా’, ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ సినిమాల్లో వర్క్ చేశాను.

2014లో కన్నడలో యష్‌కి కథ చెప్పాను. ఆయనకి నచ్చింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది వర్క్ అవుట్ కాలేదు. తర్వాత బాబీ గారి దగ్గరకి వచ్చాను. ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన గురించి చెబితే చాలా ఎమోషనల్ అవుతాను. ఆయనలాంటి మంచి వ్యక్తిని నేను జీవితంలో చూడలేదు. ఆయన రుణం తీర్చుకోలేను.

రాధిక గారి గురించి?
రాధిక గారు అద్భుతమైన నటి. ఆమె చేసిన పాత్రలు మెమరబుల్‌గా ఉంటాయి. ఇందులో బాలయ్య బాబు ఫ్యాన్‌లా కనిపిస్తారు. అలాగే మదర్ క్యారెక్టర్‌లో ఆమె పెర్ఫార్మెన్స్ చాలా కీలకం.

సత్య క్యారెక్టర్ గురించి?
సత్య నాకు అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన రోజుల నుంచి తెలుసు. ఈ పాత్ర రాసుకున్నప్పుడే సత్య పేరు అనుకున్నాను. ఇందులో తన పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆలాగే షైన్ టామ్ చాకో గారి పాత్ర కూడా చాలా కీలకంగా వుంటుంది.

మ్యూజిక్ గురించి?
ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. నాలుగు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పటికే పాటలు చాలా ఆదరణ పొందాయి.

మహిమా నంబియార్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. లవ్ స్టోరీ కూడా చాలా కీలకం.

ఒరిస్సా-ఆంధ్ర బోర్డర్‌లో జరిగే కథ ఇది. ఇది మంచి ఎంటర్‌టైనర్. మా కామ్రేడ్ అందరినీ నవ్విస్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here