‘ఈఎన్‌ఈ రిపీట్’ విజయం నాకు గొప్ప రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమాకు హీరో తరుణ్. నా లైఫ్‌కు కూడా హీరో తరుణ్: హీరో విశ్వక్ సేన్

0
5
ENE Repeat Blockbuster Repeat Celebrations
ENE Repeat Blockbuster Repeat Celebrations

‘ఈఎన్‌ఈ రిపీట్’కు లెక్కలేనంత ప్రేమను అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సక్సెస్ గొప్ప హోప్ ఇచ్చింది. సినిమాను మళ్లీ రిపీట్‌లో చూడండి. ఇంకా కొత్తగా అనిపిస్తుంది: బ్లాక్‌బస్టర్ రిపీట్ సెలబ్రేషన్స్‌లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్

‘ఈఎన్‌ఈ రిపీట్’ విజయం నాకు గొప్ప రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమాకు హీరో తరుణ్. నా లైఫ్‌కు కూడా హీరో తరుణ్: హీరో విశ్వక్ సేన్

తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఈఎన్‌ఈ రిపీట్’. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో క్రేజీ గ్యాంగ్ విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా బ్లాక్‌బస్టర్ రిపీట్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

బ్లాక్‌బస్టర్ రిపీట్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.ఈ సినిమాలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన ప్రియదర్శి గారు, కరుణ్ కుమార్ గారు.. శివాత్మిక .. అందరూ ఈ ప్రపంచంలోకి వచ్చి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఒక దర్శకుడిగా వాళ్లందరికీ థాంక్యూ చెప్తున్నాను. నందిని రెడ్డి గారు అద్భుతమైన నటి. నేను డైరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నా డైరెక్షన్ టీమ్ అందరికీ పేరుపేరునా థాంక్స్ చెప్తున్నాను. నేను వాళ్ల తరఫునే మాట్లాడుతున్నాను. మీ కుటుంబ సభ్యులు గర్వపడే క్షణమిది అని భావిస్తున్నాను. అలాగే ప్రొడక్షన్ టీమ్‌కు థాంక్యూ. సృజన్, సందీప్.. థాంక్యూ. ఎందుకంటే వాళ్లు డైరెక్షన్ టీమ్‌కు సరైన గౌరవం ఇచ్చారు. డైరెక్షన్ అనేది కూలి పని కాదు. చదువుకుని వచ్చి చేసే పని. వాళ్లకు సరైన గౌరవం ఇచ్చిన మన నిర్మాతలకు థాంక్యూ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూలెక్కలు వేసుకుంటారు. కానీ లెక్కలేకుండా ప్రేమించేది ప్రేక్షకులు మాత్రమే. మా సినిమాకు లెక్కలేనంత ప్రేమ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నేనెవరో చూడకుండా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది సినిమాపై మీకున్న ప్రేమ. ఈ ప్రేమతో ఏదైనా సాధ్యమే. ప్రేక్షకులే గేమ్ ఛేంజర్స్. నాకు దర్శకుడిగా చాలా ఫుల్‌ఫిల్‌మెంట్ వచ్చింది. నిజాయితీగా పనిచేసే ప్రతి ఒక్కరినీ ప్రేమించాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా సినిమాల్లో డబ్బుకు పెద్దగా వాల్యూ లేదని, డబ్బు వెంట పడొద్దని చెప్పేవాడిని. అది మైండ్‌లో పెట్టుకోండి. కానీ ఇప్పటి నుంచి డబ్బునే ఫాలో అవుతాను. నెక్స్ట్ సినిమా నుంచి ఏ, బీ, సీ.. అన్నీ ఫోకస్ చేసి సినిమాలు చేస్తాను.  చాలామంది చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు కదా. ఒక అథెంటిక్ వాయిస్ ఎంత దూరం వెళ్తుందో చూపిస్తాను. డ్యూటీ ఎక్కుతున్నాను. నేను మోకాళ్ల మీద పడి ప్రతి ఒక్కరినీ సార్, మేడం అని పిలవను. నాకు జనమే ముఖ్యం. నేను డైరెక్షన్ చేసినా, యాక్టింగ్ చేసినా శ్రద్ధ పెట్టి చేస్తాను. నా వాయిస్ ఏంటనేది చూపిస్తాను. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినా సినిమా ద్వారా దాన్ని సినిమా ద్వారా కరెక్ట్ చేస్తాను. ఇది రాసి పెట్టుకోండి. ఈ విజయం నాకు గొప్ప హోప్ ఇచ్చింది. నాకు ప్రేక్షకులే ఉన్నారు. మేము నిజాయితీగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీరు కూడా ఆ ప్రేమను తిరిగి ఇవ్వండి. థాంక్యూ సో మచ్. మరోసారి ఒక మాట చెప్తున్నాను. సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మళ్లీ రిపీట్‌లో చూడండి. కొత్తగా ఉంటుంది. థాంక్యూ.”

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఈఎన్‌ఈ రిపీట్’ విజయం నాకు చాలా రిలీఫ్‌ను ఇచ్చింది. రిలీజ్‌కు రెండు రోజుల ముందే మేము సినిమా చూసుకున్నాం. ఒకే సినిమాలో అన్ని అద్భుతమైన డైనమిక్స్ మాకు కనిపించాయి. మన జీవితాన్నే తెరపై ఆవిష్కరించాడు తరుణ్. ముంబైలో ఫిల్మ్  కోర్స్ చేసిన తర్వాత, 17 ఏళ్ల వయసులోనే నేను హైదరాబాద్‌లో చాలా ఆఫీసులు తిరిగి ఆడిషన్స్ ఇచ్చేవాడిని. ఆ ప్రయాణంలో చాలా కష్టాలు చూశాను. మనల్ని పెట్టి ఎవరో సినిమా తీయడం లేదని నేనే నా డైరెక్షన్‌లో యాక్టర్‌గా ‘పలక్ నామా దాస్’ సినిమాను స్టార్ట్ చేశాను. మరో 25 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా ‘ఈ నగరానికి ఏమైంది’ ఆడిషన్స్‌కు వెళ్లాను. తనకు నా ఆడిషన్ నచ్చింది. నిజానికి తను రాసుకున్న కథ నేను జీవితంలో ఏదైతే అనుభవిస్తున్నానో అదే కథ అనిపించింది.తనకు అప్పుడే చెప్పాను. కానీ అప్పుడు కూడా ఒక ఫేక్ ఈమెయిల్ వల్ల చాలా పెద్ద ఇష్యూ వచ్చింది. ఆ సమయంలో తరుణ్ నన్ను ఎంతో బలంగా నమ్మాడు. పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను పైకి లాగాడు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేశానో మీ అందరికీ తెలుసు. సినిమా బాగా లేకపోతే అందరూ మనల్ని జడ్జ్ చేస్తారు. ఆ హక్కు  ప్రేక్షకులకు ఉంది. తరుణ్ చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉంటుంది. ఆ నిజాయితీ సినిమాలో కనిపిస్తుంది. నా విజయంలో సగభాగం తరుణ్‌దే. తరుణ్ లేకపోతే నేను లేననిపిస్తుంది. ఈ సినిమాకు హీరో తరుణ్. నా లైఫ్‌కు కూడా హీరో తరుణ్. శ్రీనాథ్ తన పరీక్ష దాటేశాడు. అలాగే ఉప్పుతో నా ఫ్రెండ్‌షిప్ మర్చిపోలేనిది. కౌశిక్ అన్న వన్ అండ్ ఓన్లీ పీస్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. వివేక్ సాగర్ ఒక రాక్ బ్యాండ్‌లాంటి మ్యూజిక్ ఇచ్చారు. శివాత్మిక వండర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ చేసింది. అలాగే ప్రియదర్శి గారు, తరుణ్ కుమార్ గారు.. అందరం ఒక అద్భుతమైన టీమ్‌లా పనిచేశాం. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  సృజన్ సందీప్ వలనే సినిమా ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. వాళ్లకు విజయం రావడం నాకు ఇంకా ఆనందాన్ని ఇచ్చింది. వాళ్లు విజయం సాధిస్తే ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ మరెంతోమంది వస్తారు. థియేటర్ రన్ అద్భుతంగా ఉంది. యూఎస్‌లో నిన్న బ్రేక్ ఈవెన్ అయిపోయింది. రేపు వరల్డ్‌వైడ్‌గా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.  రేపు 50 కోట్లు టచ్ చేస్తాం. నాకు ఇంత మంచి విజయాన్ని అందించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.”

అభినవ్ గోమఠం మాట్లాడుతూ..ఈ సినిమాను ప్రేక్షకులే భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ మూడుసార్లు సినిమా చూశామని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థాంక్యూ. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా హౌస్‌ఫుల్‌గా నడుస్తోంది. ప్రేక్షకుల వల్లే ఈ సినిమా సీక్వెల్ వచ్చింది. వాళ్లే ఈ సినిమా కావాలని కోరుకున్నారు. ఈ విజయం ప్రేక్షకులకే దక్కుతుంది. తరుణ్‌కు థాంక్యూ. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో సచిన్ సెంచరీ కొడితే ఎంత హ్యాపీగా ఉంటుందో, తరుణ్ రైటింగ్, డైరెక్షన్ చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది. విశ్వక్, వెంకటేష్, శ్రీనాథ్ అందరితో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. అలాగే అనీషా, శివాత్మిక, ప్రియదర్శి గారు అందరూ అద్భుతంగా చేశారు. మా సినిమాలో నటించడానికి అడగ్గానే వచ్చిన ముగ్గురు పెద్ద డైరెక్టర్లకు థాంక్ యూ.

శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. తరుణ్ గారితో పని చేయడానికి నాకు ఎనిమిదేళ్లు పట్టింది. ‘పెళ్లిచూపులు’ సినిమా చూసి పిచ్చోడిని అయిపోయాను. అప్పుడే ఆయనతో కలిసి పని చేయాలనుకున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. వివేక్ సాగర్ గారికి, డీవోపీ అరుణ్‌కు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తరుణ్ గారు, సృజన్ గారు, సందీప్ గారు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు. విశ్వక్ మనసు చాలా మంచిది. తను ఎంతో సపోర్ట్‌గా నిలిచాడు. అలాగే అభినవ్, వెంకటేష్‌తో కలిసి నటించడం కూడా ఎంతో మంచి ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ ఎంతో ఆనందాన్నిచ్చింది. అందరం మీ సినిమాను థియేటర్‌లో సెలబ్రేట్ చేసుకుందాం.”

వెంకటేష్ కాకుమాను మాట్లాడుతూ.. “మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్‌కు థాంక్యూ. థియేటర్స్‌లో ఇచ్చిపడేశారు. ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. తరుణ్ అన్నకు థాంక్యూ.”

డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. “ ‘పెళ్లిచూపులు’ సినిమా చూసినప్పటి నుంచి నేను తరుణ్ భాస్కర్‌కు ఫ్యాన్‌ని. తను నా ఫేవరెట్ డైరెక్టర్. తరుణ్ ఎప్పుడూ చాలా కొత్త దారుల్లో నడుస్తాడు. అదే ఆయన్ని స్పెషల్‌గా నిలబెడుతుంది. తరుణ్ అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ సక్సెస్ అనేది తనకు బోనస్. ఈ సినిమాను నేను చాలా ఎంజాయ్ చేశాను. తరుణ్ యాక్టింగ్, డైరెక్షన్ రెండూ చేయాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్.”

గీతా భాస్కర్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తరుణ్ వాళ్ల నాన్నగారు ఎప్పుడూ మనుషులను సంపాదించుకుంటే పైసలు వాటంతట అవే వస్తాయని చెబుతుండేవారు. నిజంగా తరుణ్ మనుషులను సంపాదించుకున్నాడు. యాక్టింగ్ కూడా చేసుకో నాన్న.”

 శివాత్మిక మాట్లాడుతూ.. “చాలా ఆనందంగా ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాన్ని ఇచ్చిన మా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.”

  అనీషా మాట్లాడుతూ.. “ప్రేక్షకుల ప్రేమ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నన్ను ఈ సినిమాలో భాగం చేసిన తరుణ్ గారికి థాంక్యూ. అలాగే టీమ్ అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మా అందరికీ చాలా స్పెషల్. అందరికీ కంగ్రాట్యులేషన్స్. సందీప్ గారు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు.”

యాక్టర్ శ్రీరామ్ చంద్ర మాట్లాడుతూ.. “ఇది నాకు చాలా కొత్త అనుభవం. మనందరికీ సినిమా అంటే పిచ్చి. నాకు ఇలాంటి ప్రపంచాన్ని పరిచయం చేసిన తరుణ్ గారికి థాంక్యూ. సినిమా చూసి అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం చాలా ఆనందాన్నిచ్చింది.”

నిర్మాత సృజన్ మాట్లాడుతూ.. “ఇంత మంచి సినిమా ఇచ్చిన తరుణ్‌కు థాంక్యూ. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ చేయాలి. ఇది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రేపు 50 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. ఇది నాకు ఒక డ్రీమ్ ట్రూ మూమెంట్. ఈ సినిమాకు ఇంకా ఎంతో లాంగ్ రన్ ఉంటుంది.”

నిర్మాత సందీప్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. “మాకు ఇంత పెద్ద విజయం ఇచ్చిన ఆడియన్స్‌కు బిగ్ థాంక్స్. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నిర్మాతగా ఇది నా ఫస్ట్ సినిమా. ఈఎన్‌ఈ’ పార్ట్ 2 చేయడం నాకు చాలా మంచి అనుభూతి. ‘ఈ నగరానికి ఏమైంది’ నాకు చాలా ఫేవరెట్ సినిమా. అది నాకు వ్యక్తిగతంగా చాలా కనెక్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు ఎంతో పర్సనల్‌గా కనెక్ట్ అయి సినిమా గురించి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి విజయం ఇచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.”

చంద్రబోస్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మాయి నన్ను ఎప్పుడూ సినిమాల గురించి ఏమీ అడగలేదు. కానీ తరుణ్ భాస్కర్‌తో ఫోటో కావాలని అడిగింది. అందుకే ఈరోజు మా అమ్మాయిని ఫోటో కోసం తీసుకొచ్చాను. ఇంత మంచి విజయాన్ని అందుకున్న టీమ్ అందరికీ అభినందనలు. ఈ వేడుకలో టీం అందరూ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here