శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ

0
4
Srinivasa Mangapuram Movie Review
Srinivasa Mangapuram Movie Review

చిత్రం: శ్రీనివాస మంగాపురం
రిలీజ్ డేట్: జూలై 30 2026
నిర్మాణ సంస్థ: చందమామకథలు పిక్చర్స్
నటీనటులు: జైకృష్ణ ఘట్టమనేని, రషా తడాని, మోహన్ బాబు, కిక్ శ్యామ్, వాసుకి, నరేష్, బ్రహ్మాజీ..తదితరులు
సంగీతం: GV ప్రకాష్
ఛాయాగ్రహణం: జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: మాధవ్ కుమార్ గుల్లపల్లి
నిర్మాత : పి కిరణ్
దర్శకుడు: అజయ్ భూపతి

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జైకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా నేడు జూలై 30న థియేటర్లలో రిలీజ్ అయింది.

కథ :

తిరుపతికి వచ్చిన శ్రీను(జైకృష్ణ) మొదటి చూపులోనే పెద్దిరెడ్డి కూతురు మంగ(రషా తడాని)ని ఇష్టపడి ఆమె వెంట పడుతూ ఉంటాడు. పెద్దిరెడ్డి(కిక్ శ్యామ్) తిరుపతిలో బాగా పవర్ ఫుల్ వ్యక్తి. శ్రీను మంగకు ఫ్రెండ్ గా దగ్గరయిన తర్వాత ఆమె నిశ్చితార్థం వేరే వాళ్ళతో జరగుతుంది. అయినా శ్రీను మంగకు ప్రపోజ్ చేస్తాడు. మంగ నో చెప్పి వెళ్ళిపోతుంది. శ్రీను మంగను ఇబ్బందిపెట్టడం చూసి పెద్దిరెడ్డి తమ్ముడు అతన్ని కొట్టి తీసుకెళ్తుంటే లక్ష్మీపతి(అజయ్) గ్యాంగ్ వీళ్ళ మీద దాడి చేస్తుంది. పెద్దిరెడ్డి చెల్లి వరలక్ష్మి(వాసుకి) ఎంట్రీ ఇచ్చి శ్రీనుని తిరుపతిలో చూసి షాక్ అవుతుంది. అసలు శ్రీను ఎవరు? వేరే వాళ్ళతో నిశ్చితార్థం అయిన మంగ శ్రీను ప్రేమలో పడుతుందా? కూతురు ప్రేమ తెలిసిన పెద్దిరెడ్డి ఏం చేస్తాడు? వెంకటప్పయ్య నాయుడు(మోహన్ బాబు)కి ఈ కథకు సంబంధం ఏంటి? లక్ష్మీపతి ఎవరు.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :

జైకృష్ణ మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు. తెరపై అందంగా కనిపిస్తూనే నటనతో మెప్పించాడు. డ్యాన్స్ కూడా బాగా వేసాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్ లలో ఇంటెన్స్ గా అదరగొట్టాడు. జైకృష్ణ పర్ఫార్మెన్స్ తో ఘట్టమేని ఫ్యాన్స్ సంతోషిస్తారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి తెలుగు పరిశ్రమకు మరో కొత్త హీరో దొరికాడు. బాలీవుడ్ భామ రషా తడాని తిరుపతి అమ్మాయిలా క్యూట్ గా కనిపించి అలరించింది. సాంగ్స్ లో అందంగా అలరిస్తూ డ్యాన్సులతో మెప్పించింది. మోహన్ బాబుకి పాత్ర పవర్ ఫుల్ గా బాగుంది. చాన్నాళ్ల తర్వాత మోహన్ బాబుకు మళ్ళీ మంచి పాత్ర పడింది. నరేష్, బ్రహ్మాజీ అక్కడక్కడా నవ్వించారు. కిక్ శ్యామ్, వాసుకి, అజయ్, వడ్లమాని శ్రీనివాస్, కిల్లి క్రాంతి కుమార్, మాస్టర్ మహేంద్రన్, ఆదర్శ్.. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు :

సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. తిరుపతిని అందంగా చూపించారు. తిరుపతి కాకుండా వేరే లొకేషన్స్ కూడా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసారు. ఎడిటింగ్ లో స్క్రీన్ ప్లేతో పర్ఫెక్ట్ గా కట్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ GV ప్రకాష్ అదరగొట్టాడు. పాటలు బాగున్నాయి. పాత కథే అయినా కొత్త స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

విశ్లేషణ :

ఫస్ట్ హాఫ్ హీరో తిరుపతికి వచ్చి హీరోయిన్ వెనక పడుతూ ప్రేమ సీన్స్, సాంగ్స్ తో సింపుల్ గా సాగుతుంది. హీరోయిన్ కి వేరే వ్యక్తితో నిశ్చితార్థం అవడం, అయినా హీరో ప్రపోజ్ చేయడం తో కథ ఆసక్తిగా మారుతుంది. హీరోయిన్ బాబాయ్ హీరోని కొట్టడం, అక్కడో ఓ యాక్షన్ సీక్వెన్స్, హీరోయిన్ అత్త ఎంట్రీతో నెక్స్ట్ ఏం జరుగుతుంది? అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తి నెలకొంటుంది.

సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది. హీరో గతం, మోహన్ బాబు పాత్ర, బళ్లారిలో కథ మంచి ఎలివేషన్స్ తో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీని క్యూట్ గా చూపించారు. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. రెండు మూడు సీన్స్ లో కన్నీళ్లు పెట్టిస్తారు. క్లైమాక్స్ రొటీన్ ప్రేమకథ ముగింపు అయినా పెద్దిరెడ్డి, వెంకటప్పనాయుడు పాత్రల ఎంట్రీతో ఆసక్తికర ముగింపు ఉంటుంది.

లవ్ ఎమోషన్స్, కొంచెం కామెడీ, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, రివెంజ్ డ్రామాలతో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా అజిత్ భూపతి శ్రీనివాస మంగాపురం సినిమాని తెరకెక్కించాడు. ఘట్టమనేని ఫ్యాన్స్ కోసం జైకృష్ణ అన్ని హంగులు ఉన్న సినిమాని ఎంచుకున్నాడు. ఒక కమర్షియల్ ప్రేమకథగా శ్రీనివాస మంగాపురం సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

చివరగా:

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన జైకృష్ణ మొదటి సినిమాతోనే ఒక మంచి కమర్షియల్ ప్రేమకథతో మెప్పించాడు.

రేటింగ్ :

3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here