నాకు కృష్ణ గారంటే చాలా అభిమానం. కృష్ణ గారి లెగసీ నాకు తెలుసు. – దర్శకుడు అజయ్ భూపతి

0
2
Director Ajay Bhupathi Interview About
Director Ajay Bhupathi Interview About "Srinivasa Mangapuram"

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్  పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

 

శ్రీనివాస మంగాపురం ఎలా ఉండబోతుంది?
-ఇది కంప్లీట్ లవ్ స్టోరీ. అలాగే చాలా ఇంటెన్స్, ఎమోషనల్ స్టోరీ.  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా. ఫిక్షన్ కథ. అయితే నిజ జీవితంలో జరిగిన  సంఘటనల ఆధారంగా కూడా కొన్ని సీన్స్ రాశాను. అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇందులో లవ్ స్టోరీతో పాటు సూపర్ ఎమోషన్స్ ఉంటాయి. మోహన్ బాబు గారి క్యారెక్టర్‌తో పాటు ఇంకా చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. పెద్ద నరేష్ గారి క్యారెక్టర్‌ను చాలా ఎంజాయ్ చేస్తారు.

-అన్ని ఒరిజినల్ లొకేషన్స్‌లో తీశాం. సినిమా చూడడానికి చాలా ఒరిజినల్‌ నేచురల్ గా ఉంటుంది.  ఆడియన్స్ క్యారెక్టర్స్‌లోకి, ఆ వరల్డ్‌లోకి వెళ్లిపోతారు. సినిమా మీద 100 శాతం కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. సాంగ్స్ చాలా బాగుంటాయి. థియేటర్స్‌లో విజువల్స్‌ను చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే సౌండింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.

ఇందులో ప్రేమకథలో ఉన్న కొత్తదనం ఏమిటి?
-అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటారు. దాదాపు ప్రతి ప్రేమకథ కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే ట్రీట్‌మెంట్ అనేది కొత్తగా ఉండాలి. నేను చాలా బలంగా చెబుతున్నాను… ఇందులో ఉన్న ప్రతి సీన్ ట్రీట్‌మెంట్ అదిరిపోతుంది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా మొదలైన తర్వాత కథతో, పాత్రలతో ఇన్వాల్వ్ అయిపోతారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ముఖ్యంగా జై కృష్ణ, రాషా తడాని జోడిని ఆడియన్స్ చాలా ఇష్టపడతారు.

-జై కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుంది. తనను స్క్రీన్ మీద చూసినప్పుడు ఆడియన్స్ చాలా సర్ప్రైజ్ అవుతారు. రాషా తడానీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది.

ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది?
-నేను జెమినీ కిరణ్ గారికి ఒక సినిమా చేయాలి. ఈ సినిమా అనుకున్నప్పుడు దత్ గారిని వెళ్లి కలిశాను. తర్వాత జై కృష్ణను రెండు, మూడు సార్లు కలిశాను. తనపై కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మొదలు పెట్టాను.

కృష్ణ గారి కుటుంబం నుంచి ఒక హీరోని పరిచయం చేయడం అంటే కచ్చితంగా బాధ్యత, ఒత్తిడి ఉంటుంది కదా?
-నేను మొదట్లో అది పట్టించుకోలేదు. నిజానికి నేను ఎప్పుడూ నా స్టైల్‌లోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. వాళ్లు కూడా నా స్టైల్‌కే వదిలేశారు. కాకపోతే జై కృష్ణతో ఒక జర్నీ మొదలైన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయ్యాను. నాకు కృష్ణ గారంటే చాలా అభిమానం. కృష్ణ గారి లెగసీ నాకు తెలుసు. జై కృష్ణ పర్సనల్‌గా నాకు చాలా నచ్చాడు. నేను దగ్గరుండి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకున్నాను. కృష్ణ గారు ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం మనపై ఉంటుంది.

శ్రీనివాస మంగాపురం టైటిల్ గురించి?
-నేను ఈ టైటిల్‌తోనే కథ రాసుకున్నాను. ఈ కథకు, టైటిల్‌కు పూర్తి జస్టిఫికేషన్ ఉంటుంది. ఈ కథ బ్యాక్‌డ్రాప్, క్యారెక్టర్ల పేర్లు, వాళ్ల లవ్ స్టోరీ… వీటన్నింటికీ ఈ టైటిల్ సరిపోతుంది. ఇది సినిమాకు చాలా ప్లస్ అయింది.

మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-మోహన్ బాబు గారిది వెరీ ఎమోషనల్ క్యారెక్టర్. గత 20 సంవత్సరాలుగా ఆయనను ఇంత ఎమోషనల్‌గా ఆడియన్స్ చూసి ఉండరు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది.

మహేష్ బాబు గారు సినిమా చూశారు కదా… ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏమిటి?
-మహేష్ బాబు గారు సినిమా చూసి “అదిరిపోయింది” అని మెసేజ్ పెట్టారు. ముఖ్యంగా జై కృష్ణ, రాషా తడానీ జోడిని మెచ్చుకున్నారు. అలాగే సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయిందని చెప్పారు. సినిమా చాలా నచ్చిందని మెచ్చుకున్నారు.

ఎమోషన్ పరంగా సినిమా ఎలా ఉంటుంది?
-ఎమోషన్ అదిరిపోతుంది. లాస్ట్ 30 నిమిషాలు చూస్తున్నప్పుడు యూత్ అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. జై కృష్ణ, మోహన్ బాబు గారు, రాశా మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా హత్తుకుంటాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా ఈ సినిమాను తీర్చిదిద్దాను.

షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి?
-ఈ సినిమా కోసం చాలా అద్భుతమైన అవుట్‌డోర్ లొకేషన్స్ తిరిగాం. మధ్యప్రదేశ్‌లోని చందేరీలో షూట్ చేశాం. అక్కడ సౌత్ ఇండియా నుంచి షూట్ చేసిన తొలి సినిమా ఇదే. విజువల్స్ చాలా కొత్తగా ఉంటాయి. అక్కడ షూట్ చేయడం ప్రాక్టికల్‌గా చాలా టఫ్. మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని రకాలుగా సహకరించారు. అలాగే బళ్లారిలో షూట్ చేశాం. తిరుపతిలో షూట్ చేశాం. మున్నార్ వెళ్లాం. అలాగే హైదరాబాద్‌లో కూడా కొంత షూట్ చేశాం.

తిరుపతిలో షూట్ చేసినప్పుడు చాలా నిబంధనలు ఉంటాయి కదా?
తిరుమల స్టెప్స్ నుంచి పైకొండ వరకు ఏమీ చేయకూడదు. తిరుపతి అనేది మామూలుగా అన్ని టౌన్స్‌లాగే ఒక టౌన్. అక్కడ కూడా రౌడీయిజం ఉంది, గ్యాంగ్స్ ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. నేను దాన్ని చూశాను. మాకు ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు.

ఈ షూటింగ్ జర్నీలో జై కృష్ణలో వచ్చిన మార్పు ఏమిటి?
జై కృష్ణ చాలా సిగ్గరి. చాలా ఇంట్రోవర్ట్. మహేష్ బాబు గారిలాగే తనలో కూడా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. చాలామంది ట్రైలర్ చూసినప్పుడు తను మహేష్ బాబు లాగా కనిపిస్తున్నాడని చెప్పారు. అది ఫ్యామిలీ నుంచి వచ్చినదే.  జై కృష్ణలో ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అది మీరు సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది.

-అలాగే రాషా తడానీ కూడా చాలా సిన్సియర్‌గా పనిచేసింది. తనకు ఏదో సాధించాలనే లక్ష్యం ఉంది. నిజానికి నేను ‘ఆర్‌ఎక్స్ 100’ తర్వాత కొత్త వాళ్లతో పని చేయకూడదని అనుకున్నాను. కాకపోతే ఈ సినిమా చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్లిద్దరి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.

మీ సినిమాలో కథ, పాత్రలు సర్ప్రైజ్ చేస్తుంటాయి. ఇందులో సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్ ఏమైనా ఉందా?
జై కృష్ణ, రాషా తడానీ జోడి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. కొత్త వాళ్లు సినిమా చేస్తున్న ఫీలింగ్ ఆడియన్స్‌కు రాదు. నేను ఏ సినిమా చేసినా ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాను. కమర్షియల్ స్పేస్‌లో ఈ సినిమా కూడా ది బెస్ట్ అవుతుంది.

మీకు కథలు ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు?
-నేను ఎక్కువగా జనాల్లోనే ఉంటాను. బయట తిరుగుతుంటాను. దాదాపుగా నేను కథలను సమాజం నుంచే తీసుకుంటాను. ప్రతి క్యారెక్టర్‌ను అబ్జర్వ్ చేస్తాను.

మీ కెరీర్‌లో ‘శ్రీనివాస మంగాపురం’ ఏ స్థానంలో ఉంటుంది?
-ప్రతి ఫిల్మ్‌మేకర్ రిలీజ్ అవుతున్న సినిమానే బెస్ట్ అవ్వాలనుకుంటాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను. నా ఫిల్మోగ్రఫీలో ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ ప్లేస్‌లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను.

ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సాంగ్స్, యాక్షన్, ఎమోషన్స్, క్యారెక్టర్స్… అన్నీ బాగుంటాయి. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి ఆడియన్స్‌లో ఉంటుంది.

ప్రభాస్ గారు సినిమా గురించి మాట్లాడారు కదా… ఎలా అనిపించింది?
-చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన ప్రతి సినిమాను ఎంకరేజ్ చేస్తారు. చాలా స్వీట్ పర్సన్. ఆయన మా సినిమాను ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా ఆయనను కలుస్తాను.

‘మంగళవారం 2’ ఎలా ఉండబోతుంది?
-ఇప్పుడే ఎక్కువ చెప్పలేను. కాకపోతే ఒక విషయం ప్రామిస్ చేస్తున్నాను. అందులో ఉండే ఎలిమెంట్స్, క్యారెక్టర్స్, గూస్‌బంప్స్ వచ్చే సీన్స్… ఇవన్నీ చూసి ఆడియన్స్ షాక్ అవుతారు.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here