MRP – నీకెంత నాకెంత మూవీ రివ్యూ

0
6

MRP – నీకెంత నాకెంత మూవీ రివ్యూ

చిత్రం: MRP – నీకెంత నాకెంత
రిలీజ్ డేట్: జూలై 17 2026
నిర్మాణ సంస్థ: పంచజన్య ఫీచర్స్
నటీనటులు: నరేష్ అగస్త్య, డోనల్ బిష్ట్, వెన్నెల కిషోర్, సుదర్శన్, కసిరెడ్డి రాజ్‌కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహా సింగ్
సంగీతం: అజయ్ అరసాడ
ఛాయాగ్రహణం: రాకేష్ కొలాంచి
ఎడిటర్: మార్థాండ్ కె. వెంకటేష్
నిర్మాత & దర్శకుడు: శ్రవణ్ జేష్ఠ

పంచజన్య ఫీచర్స్ బ్యానర్‌పై శ్రవణ్ జేష్ఠ దర్శకత్వంలో వచ్చిన యూత్ ఎంటర్‌టైనర్ ‘MRP – నీకెంత నాకెంత’. నరేష్ అగస్త్య, డోనల్ బిష్ట్ జంటగా నటించిన ఈ సినిమా జులై 17న థియేటర్లలో విడుదలైంది. కామెడీ, ఫ్రెండ్షిప్, థ్రిల్ కలిపిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:

ఉద్యోగాలు మానేసి సొంత బిజినెస్ మొదలుపెట్టాలని అనుకుంటారు ముగ్గురు ఫ్రెండ్స్ మను, సుదర్శన్, రాజ్‌కుమార్. వెన్నెల కిషోర్, స్నేహా సింగ్ సహాయంతో గ్యాంగ్‌స్టర్ దైవాజీ దగ్గర 50 లక్షలు అప్పు తీసుకుంటారు. ఈలోపు మను తన ప్రియురాలు అమృతతో విడిపోతాడు. బిజినెస్ దెబ్బతినడంతో అప్పు తీర్చలేక ఒక రిస్కీ ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ తలకిందులై వాళ్లు ఊహించని సమస్యల్లో ఇరుక్కుంటారు. చివరికి అప్పు తీరిందా, లవ్ తిరిగి కలిసిందా అనేది సినిమాలో చూడాలి.

నటీనటుల పనితీరు :

నరేష్ అగస్త్య ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్, సీరియస్ సీన్స్ రెండింట్లోనూ ఒదిగిపోయాడు. డోనల్ బిష్ట్ అమృతగా గ్లామర్ తో పాటు ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ లవ్ ట్రాక్ కి బలం చేకూర్చింది. వెన్నెల కిషోర్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఆయన పంచ్ లు, ఎక్స్‌ప్రెషన్స్ థియేటర్ లో నవ్వులు పూయించాయి. సుదర్శన్ ఆయనకు మంచి కాంబినేషన్ ఇచ్చాడు. ఇద్దరి కామెడీ సన్నివేశాలు బాగా వర్క్ అవుట్ అయ్యాయి. కసిరెడ్డి రాజ్‌కుమార్ మూడో ఫ్రెండ్ గా సహజంగా నటించాడు. హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహా సింగ్ తమ పాత్రల పరిధిలో మంచి సపోర్ట్ ఇచ్చారు. మొత్తంగా అందరి పెర్ఫార్మెన్స్ సినిమాకు యూత్ ఫీల్ తెచ్చింది.

సాంకేతిక నిపుణుల పనితీరు:

టెక్నికల్ గా సినిమా నీట్ గా ఉంది. రాకేష్ కొలాంచి సినిమాటోగ్రఫీ యూత్ ఫుల్ వైబ్ ఇచ్చింది. అజయ్ అరసాడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కామెడీ, థ్రిల్ రెండింటినీ ఎలివేట్ చేసింది. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వల్ల సినిమా లెంగ్త్ కంట్రోల్ లో ఉంది. శ్రవణ్ జేష్ఠ దర్శకుడిగా కథను సింపుల్ గా, ఎంటర్ టైన్ చేసేలా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. కొత్త కథ కాకపోయినా, ప్రజెంటేషన్, నటీనటుల ఎనర్జీ వల్ల ‘MRP’ ఒక మంచి టైమ్ పాస్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది.

విశ్లేషణ:

మొదటి భాగం క్యారెక్టర్స్ ని పరిచయం చేయడం, వారి కలలను చూపించడంపై ఫోకస్ చేసింది. స్నేహితుల బాండింగ్, మను-అమృత లవ్, వెన్నెల కిషోర్ కామెడీతో సినిమా లైట్ గా సాగుతుంది. కొన్ని చోట్ల పేస్ నెమ్మదిగా అనిపించినా, సెకండ్ హాఫ్ కోసం బిల్డప్ బాగుంది. బిజినెస్ ఫెయిల్ అయ్యాక వచ్చే ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ ఊపందుకుంటుంది. అప్పు, ప్లాన్, దొరికిపోయే ప్రమాదం లాంటి సన్నివేశాలు టెన్షన్ తో పాటు నవ్వులు కూడా పంచుతాయి.

రేటింగ్: 2.75/5

చివరగా:
కామెడీతో పాటు చిన్న థ్రిల్ కావాలనుకునే వారికి ‘MRP’ ఒకసారి చూడదగ్గ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here