‘అలా నిన్ను చేరి’ మూవీ రివ్యూ

0
110

చిత్రం: అలా నిన్ను చేరి

విడుదల తేదీ: 10-11-2023

నటీనటులు: దినేష్ తేజ, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, మహేష్, బాషా, శత్రు తదితరులు

సంగీతం: సుభాష్ ఆనంద్

నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్

దర్శకత్వం: మారేష్ శివన్

మంచి ఫీల్ గుడ్ మూవీతో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పించగా.. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించగా ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాశారు.. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ:

విశాఖలోని వెంకటా పూర్ లో గణేష్ (దినేష్ తేజ్) తన ఫ్రెండ్స్‌తో కలిసి కాలేజ్ అంటూ జాలీగా తిరుగుతుంటాడు. ఎలాగైనా సరే డైరెక్టర్ అవ్వాలని సినిమా పిచ్చితో ఉంటాడు. అలాంటి గణేష్ లైఫ్‌లోకి ప్రేమ చాప్టర్ మొదలవుతుంది. దివ్య (పాయల్ రాధాకృష్ణ) ఎంట్రీతో గణేష్ లైఫ్ మారుతుంది. ఈ ప్రేమ విషయం దివ్య తల్లి కంచు కనకమ్మ (ఝాన్సీ)కి తెలుస్తుంది. దివ్యను తన బావ కాళీ (శత్రు)కి ఇచ్చి పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంది. ఆ టైంలో గణేష్ వద్దకు పాయల్ వస్తుంది. కానీ గణేష్ మాత్రం పెళ్లి ముఖ్యమా? కెరీర్ ముఖ్యమా? అని తేల్చుకోలేకపోతాడు? ఆ తరువాత దివ్యకు ఏం జరిగింది? గణేష్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? గణేష్ జీవితంలోకి అను (హెబ్బా పటేల్) ఎలా వస్తుంది? చివరకు గణేష్ తన ఊరి దాటి సిటీకి వచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? గణేష్ డైరెక్టర్ అవుతాడా? దివ్యకు గణేష్ శాశ్వతంగా దూరం అవుతాడా? అన్నదే కథ.

నటీనటుల పనితీరు:

గణేష్ పాత్రలో పక్కింటి కుర్రాడిలా దినేష్ తేజ్ చక్కగా నటించాడు. ఎమోషనల్ సీన్లతో పాటు యాక్షన్ సీన్స్‌తో మెప్పిస్తాడు. టోటల్‌గా దినేష్ తేజ్ తనలోని నటనలో అన్ని కోణాలతో ఇంప్రెస్ చేశాడు. ఇక పాయల్ ప్రథమార్థంలో కనిపిస్తే.. హెబ్బా ద్వితీయార్దంలో ఆకట్టుకుంటుంది. రెండు పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. పాయల్‌ను హోమ్లీగా చూపిస్తే.. హెబ్బాను బోల్డ్‌గా చూపించారు. ఇద్దరూ చక్కగా నటించారు. మిగిలిన పాత్రల్లో రంగస్థలం మహేష్, బాషా, అనశ్వి, ఝాన్సీ, కల్పలత, శత్రు ఇలా అందరూ చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ప్రేమకు, లక్ష్యానికి మధ్య సంఘర్షణను హీరో పాత్రతో చక్కగా చూపించాడు దర్శకుడు మారేష్ శివన్. ఈ చిత్రంలో మాటలు గుండెలను తాకేలా ఉంటాయి. పాటలు పర్వాలేదు. ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. కాకపోతే ఎడిటర్ పెట్టిన ఆ నిడివి చాలా ఎక్కువగా ఉండటం సమస్యగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చక్కగా ఉన్నాయి. మొదటి సినిమానే అయినా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా చిత్రాన్ని నిర్మించారు.

విశ్లేషణ :

ప్రేమ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్. ప్రేమ లేకుండా జీవితాన్ని గానీ, సినిమాను గానీ ఊహించుకోలేం. అలా నిన్ను చేరి సినిమా అంతా కూడా ప్రేమతోనే నిండిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో హీరో హీరోయిన్ల ప్రేమ ఉంటే.. రెండో హాఫ్‌లో వన్ సైడ్‌లా ఇంకో హీరోయిన్ ప్రేమను చూపిస్తారు. ఈ రెండిటినీ బ్యాలన్స్ చేస్తూ దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడు

ఈ చిత్రం కోసం ఓ పదిహేనేళ్ల క్రితం నాటి వాతావరణం, పరిస్థితుల్ని ఎంచుకున్నాడు. అప్పుడు ఇంతగా టెక్నాలజీ ఉండేది కాదు. వాట్సప్, ఫేస్ బుక్ వంటివి లేవు. ఫోన్ చేసుకోవాలన్నా ల్యాండ్ లైన్‌కే చేయాలి.. లేదంటే చాలా రేర్‌గా డబ్బా ఫోన్‌లు కనిపిస్తుంటాయి. అలాంటి బ్యాక్ డ్రాప్‌లో రాసుకున్న ఈ కథ.. ఇప్పటి తరానికి కాస్త ఫ్రెష్‌గానే అనిపిస్తుంది. ఎమోషనల్‌గా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ప్రేమలో ఉండే హాయిని, సంతోషాన్ని చూపించారు. ద్వితీయార్దంలో లక్ష్యం కోసం పని చేసే కుర్రాడి అంకితభావం, కష్టపడేతత్త్వంను చూపించారు. రెండో భాగంలో హెబ్బా పటేల్‌తో రాసుకున్న ట్రాక్, చెప్పించిన డైలాగ్స్ బాగుంటాయి.

చివరగా: ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునే లవ్ స్టొరీ ‘అలా నిన్ను చేరి’

రేటింగ్ 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here