“మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం “మా ఊరి పొలిమేర 2”. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో డా.అనిల్ విశ్వనాథ్. దర్శకత్వంలో గౌరీ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. గీతా ఆర్ట్స్‌కు చెందని వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. విడుదలైన రోజు నుంచి ప్రేక్షకాదరణతో బ్లాక్ బస్టర్ విజయం దిశగా చిత్రం కొనసాగుతుంది. ఈ సందర్భంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వంశీ నందిపాటిని అభినందిచారు. మంచి అభిరుచి గల వ్యక్తి వంశీ అని, మొదటి ప్రయత్నంలోనే చిరస్మరణీయమైన హిట్ అందుకోవడం ఆనందంగా ఉందని అల్లు అరవింద్ చెప్పారు. తమ సినిమాను ఇంతటి కమర్షియల్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘మా ఊరి పొలిమేర 2’ టీమ్ నవంబర్ 10 నుంచి ఆంధ్రాలో పర్యటించనుందని తెలియజేశారు.
Home న్యూస్ టుడే ‘మా ఊరి పొలిమేర2’ తో సక్సెస్ సాధించిన వంశీ నందిపాటిని అభినందించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు...