విజయవాడలో సొంత ఆఫీస్ సమకూర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్

0
101

హీరో సుమన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫిలిం ఛాంబర్ ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించబడి, కేవలం 5 వేల రూపాయలతో సభ్యులకు మెంబర్షిప్ ఇస్తూ సినీ పరిశ్రమ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏ పీ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ విజయవాడ తాడేపల్లిలో ఓ ఫ్లాట్ ని కొనుగోలు చేసి సొంత ఆఫీస్ ని ఏర్పాటు చేసుకొంది. సినీ హీరో సుమన్ చేతుల మీదుగా సొంత ఆఫీస్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆఫీస్ ప్రాంగణంలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది!!

ఛాంబర్ అధ్యక్షులు మధు మోహన్ కృష్ణ, జనరల్ సెక్రటరీ మోహన్ గౌడ్, ఉపాధ్యక్షులు వీస్ విజయ్ వర్మ పాకలపాటి, జాయింట్ సెక్రటరీ చైతన్య జంగా పాల్గొన్న ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న హీరో సుమన్ మాట్లాడుతూ… “ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని, ఇక్కడ తక్కువ ఖర్చులో షూటింగ్ అవుతుందన్న నమ్మకాన్ని ప్రభుత్వం కల్పిస్తే, అన్ని భాషల చిత్ర నిర్మాణ సంస్థలు ఆంధ్రా వైపు చూస్తాయని, ఈ దిశగా మధు, గౌడ్, వర్మ మరియు చైతన్య కృషి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు!!

చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడేలా తమ ఛాంబర్ కృషి చేస్తుందని అధ్యక్ష కార్యదర్శులు అంబటి మధుమోహన్ కృష్ణ, మోహన్ గౌడ్ లు పేర్కొన్నారు. స్టూడియో నిర్మాణానికి మరియు నటులు, సాంకేతిక నిపుణులు మరియు ఫిలిం ఎంప్లాయిస్ కి స్థలాలు ఇవ్వడం, చిత్ర నిర్మాణానికి ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ తరహాలో ప్రోత్సాహం అందించడం ద్వారా హైదరాబాద్ కి సమాంతరంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో వేళ్ళూనుకుంటుందని ఉపాధ్యక్షులు వీస్ విజయ్ వర్మ పాకలపాటి, సంయుక్త కార్యదర్శి చైతన్య జంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here