ప్రోగ్రెసివ్ ప్యానెల్ మేనిఫెస్టో విడుదల

0
7
Progressive Panel Manifesto Released
Progressive Panel Manifesto Released

ప్రోగ్రెసివ్ ప్యానెల్ మేనిఫెస్టో విడుదల

అర్హత కలిగిన ప్రతి సభ్యుడికి రూ.5 లక్షల క్యాష్‌లెస్ వైద్య సదుపాయం.. రూ.50 లక్షల ఎమర్జెన్సీ ఫండ్: ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

అవసరమైన ప్రతి సపోర్ట్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం: నిర్మాత రవిశంకర్

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఈ నెల 6న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తమ మేనిఫెస్టోను ప్రకటిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్యానెల్ సభ్యులు తమ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలను వివరించారు.

నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఎలక్షన్స్‌లో రెండు వర్గాలు ఉండటం మామూలే. ఇక్కడ అందరం సభ్యులమే. కానీ ఐడియాలజీలు వేరు. మా మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను మీకు వివరిస్తున్నాను. అవసరంలో ఉన్న నిర్మాతలకు వైద్య సహాయం, అత్యవసర సహాయం అందించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ప్రతి అర్హత కలిగిన సభ్యుడికి రూ.5 లక్షల క్యాష్‌లెస్ వైద్య సదుపాయం కల్పించేలా ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తాం. గతంలో ఈ విషయంలో కొంత పారదర్శకత లోపించింది. చాలామంది మెంబర్స్‌కి ఈ విషయం తెలుసు. ఈసారి క్యాష్‌లెస్ కార్డుతో ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి, ఆ కార్డును ఉపయోగించుకునే విధంగా చేస్తాం. ఇందులో ఎలాంటి రికమండేషన్ అవసరం లేదు.

అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నిర్మాతల కోసం రూ.50 లక్షల ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేస్తాం. ఎవరికైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఫండ్ ద్వారా వారికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం. మనకు అన్యువల్ మెంబర్స్‌గా దాదాపు 300 మంది ఉన్నారు. వారందరికీ వన్‌టైమ్ మినిమం ఫీజు నిర్ణయించి, వారిని రెగ్యులర్ మెంబర్స్‌గా చేస్తాం

కొత్త నిర్మాతలను ప్రోత్సహించడానికి సింగిల్ విండో ప్రొడ్యూసర్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తాం. కొత్త నిర్మాతలకు గైడెన్స్ ఇవ్వడానికి ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది. కథ విషయంలో కూడా గైడెన్స్ ఇవ్వడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.

మహిళా భద్రతకు సంబంధించి ప్రొడక్షన్ హౌస్‌లలో పాటించాల్సిన నిబంధనలను అమలు చేసే బాధ్యతను కూడా తీసుకుంటాం. కార్మిక సంఘాలతో ఏవైనా సమస్యలు వచ్చినా నిర్మాతలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తాం. అందరికీ అందుబాటులో ఉండే, పారదర్శకమైన కౌన్సిల్ ఉండాలి.

అందరినీ ఏకతాటిపైకి తీసుకెళ్లాలి. అందరినీ ఒకేలా చూడాలి. కానీ ప్రస్తుతం కొన్ని నిర్ణయాలు ఏకపక్షంగా జరుగుతున్నాయి. అది సరికాదు. ఇక్కడ ఎవరైనా సినిమా కులానికి చెందినవారే. అందరినీ సమానంగా చూడాలనే విధానాన్ని ఒక చట్టంలా చేయాలనేది మా ఉద్దేశం” అని అన్నారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. గత మూడు నెలలు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అద్భుతంగా ఆడుతున్నాయి. మరోసారి నిర్మాతలకు మంచి రోజులు వచ్చాయనే నమ్మకం వచ్చింది. ఇది ఇండస్ట్రీకి చాలా మంచి ప్రోత్సాహం. మా ప్యానెల్ నుంచి నిర్మాతలందరికీ ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. మేము నైజాంలో 18 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాము. అందులో చాలా సినిమాలు చిన్న సినిమాలే. రిలీజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న సినిమాలు దాదాపు వంద వరకు ఉన్నాయి. మేము చిన్న నిర్మాతల వైపు నిలబడతాం. సినిమాను రిలీజ్ చేసుకునే భరోసా మేము ఇప్పించగలం. అయితే ఏదో సినిమా రిలీజ్ చేసుకోవడం మాత్రమే కాదు.. సినిమా విజయం కూడా సాధించాలి. దీనిపై అందరం కలిసి డిస్కషన్ చేసుకుని, మంచి సినిమా చేయడానికి కావాల్సిన సూచనలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. నిర్మాతలకు అవసరమైన సపోర్ట్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు.

నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ.. “ఎలక్షన్స్ విషయంలో నాపై వ్యక్తిగతంగా జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. కొందరు నన్ను అడ్డుకోవాలని చూశారు. నా నామినేషన్ విషయంలో కూడా అనేక పరిణామాలు జరిగాయి. చివరకు న్యాయపరంగా పోరాడాల్సినవచ్చింది. పారదర్శకత, నిజాయితీ, నమ్మకం, సమానమైన హక్కులు ఉండాలనేది మా ఉద్దేశం. నిర్మాతల కౌన్సిల్ అందరిదీ. చిన్న నిర్మాత అయినా, పెద్ద నిర్మాత అయినా అందరికీ సమానమైన గౌరవం, హక్కులు ఉండాలి. అదే మా ప్రోగ్రెసివ్ ప్యానెల్ లక్ష్యం” అన్నారు.

ఈ ప్రెస్ మీట్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిర్మాతలు అందరూ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here