గొప్ప సందేశంతో తెరకెక్కించిన ‘హుషారు 2’ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి

0
7
Hushaaru 2 Movie Teaser Launch Event
Hushaaru 2 Movie Teaser Launch Event
గొప్ప సందేశంతో తెరకెక్కించిన ‘హుషారు 2’ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి

హెచ్‌కే ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్ బ్యానర్ల మీద రాహుల్ వర్మ, కె. వీణా రాణి, కె. హనుమంత్ రాజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హుషారు 2’. ఈ మూవీకి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంటోనీ, దినేష్ తేజ్, శశిధర్, రాజై రోవన్, అభిజ్ఞ, శ్రీకాంత్ కన్ని, బాబీ రాచకొండ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీ టీజర్‌ని మంగళవారం నాడు రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ .. ‘హర్ష గారు ‘హుషారు 2’లో నాకు గొప్ప పాత్రను ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మంచి పాత్రను పోషించాను. ‘హుషారు’లో ఎంత నవ్వించారో.. అంతకు మించి నవ్విస్తూనే, ఆలోచించేలా చేస్తారు. నిరుదోగ్య సమస్యను ఎంతో గొప్పగా చూపించారు. పని హక్కుని కోల్పోతోన్నాం. శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లేదు. నలిగిపోతోన్న యువతకి స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఆత్మాభిమానంతో బతకాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటి గొప్ప చిత్రాన్ని ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ‘హుషారు 2’ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. దర్శకుడు హర్ష ఎక్కడా కూడా రాజీ పడడు. రవిరాజా పినిశెట్టి తర్వాత నాకు హర్షలో ఆ క్వాలిటీ కనిపించింది. కెమెరామెన్ ఎంతో ఓర్పుగా ఉన్నాడు. సినిమా నచ్చితే ప్రజలు ఎవరినైనా సరే స్టార్‌లను చేస్తారు. అలా ఈ మూవీని జనాలకు నచ్చేలా హర్ష తీశారు. ‘హుషారు 2’ మూవీని జనాల వద్దకు తీసుకు వెళ్లాలని మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అన్నారు.

అశోక్ గల్లా మాట్లాడుతూ .. ‘‘హుషారు 2’ టీజర్ చూస్తే సినిమా ఎలా ఉండబోతోందో స్పష్టంగా అర్థం అవుతుంది. ఇందులో మా నలుగురి పాత్రలు ఎంతో వినోదాత్మకంగా ఉంటాయి. మాకు గురువులా మూర్తి గారి పాత్ర ఉంటుంది. సినిమా ఆరంభం నుంచే నవ్విస్తాం. టీజర్‌కి మించి సినిమాలో నవ్వులు ఉంటాయి. ఇది కేవలం టీజర్ లాంచ్ ఈవెంట్. మిగతాది సక్సెస్ మీట్‌లో మాట్లాడతాను’ అని అన్నారు.

రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ .. ‘‘హుషారు 2’ టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మేం కూడా టీజర్ ఇప్పుడే చూస్తున్నాం. టీజర్‌ను మించి సినిమా ఉంటుంది. మా చిత్రాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ .. ‘‘హుషారు’ నా జీవితంలో బెస్ట్ మెమోరీ. రెండో పార్ట్‌ని ఏదో తీయాలని తీయలేదు. నా జీవితంలో నా స్నేహితులతో కలిసి చేసిన సంఘటనల ఆధారంగానే ‘హుషారు 2’ తీశాను. నా చిన్ననాటి ఫ్రెండ్ రాహుల్ వర్మ ఈ సినిమాతో నిర్మాణంలోకి వచ్చాడు. నాకు రాహుల్ మంచి స్నేహితుడు. ఈ చిత్రంలో రాహుల్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. సినిమాని చూస్తే అశోక్ గల్లా, శశి, దినేష్, రవి ఆంటోనీ రియల్ లైఫ్‌లో కూడా ఫ్రెండ్స్‌లా కనిపిస్తారు. మూర్తి గారితో వర్క్ చేయడం ప్రైస్ లెస్ మూమెంట్స్. ఆయనతో ఉండే సీన్స్ థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి. సినిమా చాలా బాగా వచ్చింది. మున్ముందు ఈవెంట్లలో మరిన్ని మాట్లాడతాను’ అని అన్నారు.

నిర్మాత రాహుల్ వర్మ మాట్లాడుతూ .. ‘‘హుషారు’ నాకు చాలా నచ్చింది. అందులో నా జీవితాన్ని, నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. ‘హుషారు 2’ నేను నిర్మించడం ఆనందంగా ఉంది. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆర్ నారాయణమూర్తి గారు మా సినిమాలో ఉండటం మా అదృష్టం. సినిమా అందరినీ మెప్పిస్తుందని అనుకుంటున్నాను’ అని అన్నారు.

విధి యాదవ్ మాట్లాడుతూ .. ‘‘హుషారు 2’ మూవీని ఎంతో కష్టపడి చేశాం. ప్రేమ, స్నేహం, హాస్యం ప్రధాన అంశాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ ప్రయాణంలో నేను ఎంతో నేర్చుకున్నాను. మా టీజర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలానే మాకు సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నటుడు దినేష్ తేజ్ మాట్లాడుతూ .. ‘మళ్లీ నాకు ‘హుషారు’ రోజులు గుర్తుకు వచ్చాయి. హర్ష నాకు మొదటి అవకాశం ఇచ్చాడు. ‘హుషారు’ సినిమాకి పది రెట్ల వినోదాన్ని ఇచ్చేలా ‘హుషారు 2’ ఉంటుంది. రాహుల్ అన్నతో మళ్లీ వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఆర్ నారాయణ మూర్తి గారు మా సినిమాలో ఉండటం అదృష్టం. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. త్వరలోనే మా సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది’ అని అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ రామిశెట్టి మాట్లాడుతూ .. ‘హర్షతో కలిసి ‘ఓం భీం బుష్’ చేశాను. మా ఇద్దరికీ ఫ్రీక్వెన్సీ కుదిరింది. హర్ష కథల్ని చాలా కొత్తగా రాస్తుంటారు. ‘హుషారు 2’తో హర్ష అనుకున్నది నేను నెరవేర్చానని అనుకుంటున్నాను. ‘హుషారు 2’ టీం నా కుటుంబంలా మారింది. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

https://youtu.be/a7ehEhQnALE

నటీనటులు: రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంటోని, దినేష్ తేజ్, శశిధర్, రాజై రోవాన్, అభిజ్ఞ, శ్రీకాంత్ కన్ని, బాబీ రాచకొండ తదితరులు

సాంకేతిక సిబ్బంది:


బ్యానర్ల – హెచ్‌కే ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్

నిర్మాత – రాహుల్ వర్మ
దర్శకుడు – శ్రీ హర్ష కొనుగంటి
డి ఓ పి – శ్రీనివాస్ రెడ్డి జి
ఆర్ట్ డైరెక్టర్  – శ్రీకాంత్ రామిశెట్టి, కె వి రమణ  
కాస్ట్యూమ్ డిజైనర్  – ఆజాద్ వర్మ
పీఆర్వో – బియాండ్ మీడియా (నాయుడు-ఫణి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here