దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెలుగా జాన్వీ, ఖుషి కపూర్‌లు నార్త్‌తో పాటు సౌత్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పటికే బాలివుడ్‌లో ఎంట్రీ ఇచ్చి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు టాలీవుడ్‌కి పరిచయం అవుతుందా? అని ఎదురుచూసే వారి సంఖ్య తక్కువేం కాదు. ఎందుకంటే, ఈ మధ్య టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో సినిమా ప్రకటన వచ్చినా.. హీరోయిన్‌గా జాన్వీ పేరే వినిపిస్తుండటం తెలిసిందే. ఇక జాన్వీ, ఖుషి కపూర్‌లలో ఉన్న మరో టాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు వారి తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్.
జాన్వీ, ఖుషి వేసిన పెయింటింగ్స్‌ను పోస్ట్ చేసిన బోనీ కపూర్.. “లాక్‌డౌన్ సమయంలో జాన్వీ, ఖుషీల యొక్క సృజనాత్మకతను చూడటం ఆనందంగా ఉంది. ఇది వారి పని” అని తెలిపారు. జాన్వీ కపూర్ వేసిన తిరుమల వేంకటేశ్వరుని పెయింటింగ్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలందుతున్నాయి. అలాగే ఖుషి పెయింటింగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో నెటిజన్లు.. జాన్వీ, ఖుషి టాలెంట్ చూసి.. మంచి భవిష్యత్ వారికి ఉండాలని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Delighted to see my daughter Janhvi’s creative urges during lockdown. This is her work. pic.twitter.com/9bVV2ikEcN
— Boney Kapoor (@BoneyKapoor) September 14, 2020
Happy to see Khushi’s creativity during lockdown. pic.twitter.com/0hMp8y9Tho
— Boney Kapoor (@BoneyKapoor) September 14, 2020