3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న విక్టరీ వెంకటేష్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘బొబ్బిలి రాజా`

0
25

విక్టరీ వెంకటేష్ హీరోగా డి.రామానాయుడు సమర్ఫణలో డి.సురేష్ బాబు నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి పతాకంపై బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బొబ్బిలి రాజా’. 1990 సెప్టెంబర్ 14న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి విక్టరీ వెంకటేష్‌కి తిరుగులేని మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రం విడుద‌లై నేటితో 30 యేళ్లు పూర్తి చేసుకుంది. దివ్య భార‌తి హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ చిత్రంలోవాణిశ్రీ, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, శివాజీ రాజా ఇతర ముఖ్యపాత్రల్లో న‌టించారు. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి కమల్ హాసన్ క్లాప్ కొట్ట‌డం విశేషం.

పూర్తి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ చేసిన జాకీచాన్ తరహా యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. మొద‌టి సినిమాతోనే త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది దివ్య భార‌తి. ఇళయరాజా సంగీతంతో పాటు పరుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ, మాట‌లు ఈ మూవీకి పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా బలపం పట్టి బామ ఒళ్ళో.. కన్యాకుమారి కనపడదా..` గీతాలు ఇప్ప‌టికీ శ్రోతల‌ని అల‌రిస్తున్నాయి. కన్యా కుమారి కనబడదా దారి పాటలో తొలిసారి 2D అనిమేషన్ ఉపయోగించడం సంచలనం రేపింది. వెంక‌టేష్ టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈ చిత్రం 3 కేంద్రాల్లో ద్విశత దినోత్సవం జరుపుకుంది. హిందీలో ‘రామ్ పూర్ కా రాజా’, తమిళంలో ‘వాలిబన్’ పేరుతో డబ్ అయి అక్కడ కూడా సూపర్ సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here