డాషింగ్ పూరీ జగన్నాధ్ ‘పూరీ మ్యూజింగ్స్` పేరుతో కొన్ని ఆడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు ఏదో ఒక టాపిక్ తీసుకుని వాటిపై తనకున్నఅభిప్రాయం ఏమిటో చాలా విపులంగా తెలియజేస్తున్నారు పూరి. ఇప్పటికే ఎన్నో టాపిక్‌ల మీద వాయిస్ మ్యూజింగ్స్ విడుదల చేసిన పూరి సోమవారం వన్ మీల్ ప్రాముఖ్యతను వివరించారు.
రోజుకి వన్ మీల్ తింటే ఎటువంటి రోగాలు రావని జంతువులు రోజుకి ఒక్కసారి తినడం వల్లే వాటికి గుండెపోటు, షుగర్ వంటి వ్యాధులు రావని, హెవీగా తినడం వల్లే మనిషికి లేనిపోని జబ్బులు వస్తున్నాయని పూరి తన మ్యూజింగ్స్ ఆడియోలో పేర్కొన్నారు.
”జంతువులు ఎప్పుడూ..మరీ లావుగా అయిపోవడం కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువై కొట్టుకోవడం కానీ ఉండదు. ఎప్పుడూ ఒకే వెయిట్‌తో ఉంటాయి. వాటికి ఏ జబ్బులూ రావు. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ, రోజుకి ఒక్కసారే తింటాయ్. మనం ఎన్నిసార్లు తింటామో మనకే తెలియదు. డయాబెటిస్, హార్ట్ స్ట్రోక్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రజర్, పక్షవాతం, ఒబెసిటి.. ఇలా ఎన్నో జబ్బులు మనుషులకే వస్తాయ్. మనకున్న అన్ని జబ్బులకీ కారణం ఒకే ఒకటి. ఫుడ్‌కమ్‌జెన్షన్. ఈ శతాబ్ధంలోనే ఇది ఎక్కవైపోయింది. యానిమల్ ఒక్కసారే ఎందుకు తింటుందంటే? మళ్లీ తిండి కావాలంటే.. అది లైఫ్ రిస్క్ చేసి వేటాడాలి.
అందుకే అవి ఆకలి వేసినప్పుడే తింటాయ్. కల్టివేషన్, కూలింగ్ ఫ్రిడ్జ్ మనల్ని సంకనాకించాయ్..అన్నీ తినేసి మళ్లీ మిడ్ నైట్ లేచి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడటం అలవాటైపోయింది మనకి. 10 సార్లు తినడం అలవాటు చేశాం. కాబట్టే ఆ టైమ్‌కి బాడీలో జ్యూస్‌లు రెడీ అయిపోయి, దానిని ఆకలి అనుకుంటాం. అది ఆకలి కాదు అలవాటు. మనకి ఆకలికి, దాహానికి తేడా తెలియదు. అందుకే జంతువులు వెంటనే నీళ్లు తాగుతాయ్. నీళ్లు తాగినా సరే సేమ్ ఫీలింగ్ ఉంటే.. అది ఆకలి అని తెలుసుకుంటాయ్. ఆ మాత్రం కామన్‌సెన్స్ మనకి లేదు. మనం తిన్న వెంటనే 3 గంటల్లో జనరేట్ అయిన గ్లూకోజ్‌ని మన బాడీ వాడుకుంటది. ఎక్స్‌ట్రా గ్లూకోజ్‌ని లీవర్‌లో దాచుకుంటది. తర్వాత అవసరం ఉన్నప్పుడు మెల్లగా వాడుకుందామని బాడీ ఉద్దేశ్యం. కానీ మన బాడీ లివర్‌లో ఉన్నదానిని తీసి వాడే లోపు, మనం ఇంకో ధమ్కీ బిర్యానీ తింటాం. దానిని ఎక్కడ స్టోర్ చేయాలో తెలియక, ఫ్యాట్ కింద మార్చేసి మన బాడీలో మజిల్స్‌లో పెడతది. ఈ ఫ్యాట్‌ని తీసే ఛాన్స్ మనం ఎప్పుడూ బాడీకి ఇవ్వట్లేదు. జబ్బు చేస్తే మనకి ఏమీ తినబుద్ది కాదు. ఎందుకో తెలుసా? మన బాడీ అరుస్తుంటది. తినకు తినకు ప్లీజ్ అని.
బుద్దిస్ట్‌లందరూ రోజుకి ఒక్కసారే తింటారు. రంజాన్ టైమ్‌లో ముస్లింలందరూ ఒక్కసారే తింటారు. హ్యాపీగా ఉంటారు. నువ్వు తినడం ఆపితే.. నీ బాడీ అన్ని సెట్ చేసుకుని, నిన్ను పర్ఫెక్ట్ వెయిట్‌లో ఉంచి, ఏ జబ్బులూ రాకుండా అదే చూసుకుంటది. నువ్వు చేయాల్సిందల్లా.. దయచేసి నీ కడుపుని డస్ట్ బిన్‌లా వాడవద్దు. మంచి ఉదాహరణ చెబుతాను. ఈ కరోనా టైమ్‌లో ఇన్ని నెలలుగా కంట్రీలో ఎవడికైనా కరోనా తప్ప.. మరో జబ్బు వచ్చిందా? కనీసం జలుబు, జ్వరాలు కూడా లేవు. ఎందుకంటే చిరాకు వచ్చి తక్కువ తింటున్నామ్. ఇంటి పట్టునే ఉండి ఇంటి ఫుడ్ తింటున్నాం. ఇంతకు ముందు హాస్పిటల్స్ ఖాళీ ఉండేవి కావు. బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోవాలంటే పెద్ద క్యూ ఉండేది. ఇవన్నీ మాయమైపోయాయాల లేదా? చాలా రోగాలు రోడ్డు మీద ఫుడ్ వల్లే. లాక్‌డౌన్‌లో కొంచెం తక్కువ తింటేనే మనకి ఇంత ఆరోగ్యం వస్తే.. రోజూ ఒక్క పూటే తింటే?. అయితే సడెన్‌గా వన్ మీల్‌కి వస్తే.. ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రోజూ రెండు సార్లు తినండి. నేను 30 సంవత్సరాలుగా రోజుకి రెండు సార్లు మాత్రమే తింటున్నాను. బ్రేక్ ఫాస్ట్ తినను. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు నాకు. స్టమక్ అప్సెట్‌లు కూడా లేవు. ప్రతి సంవత్సరం నా రిపోర్ట్స్ నార్మల్‌గా ఉంటాయ్. నా ఫ్రెండ్ డాక్టర్. తను కూడా యానిమల్‌లా రోజుకు ఒక్కసారే తింటాడు. సిక్స్ ప్యాక్‌తో ఫిట్‌గా ఉన్నాడు. బట్ రోజంతా వన్ మీల్ మీద ఉండటం చాలా కష్టం. కనీసం టు మీల్ ఫర్ డే కి వచ్చేయండి. టు మీల్ కలిపితే వన్ మీల్ క్వాంటిటీ అయి ఉండాలి. ఇది చేసే ముందు ఒక్కసారి మీ డాక్టర్‌ని అడగండి. బట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. గుండె పోటు వచ్చి పులి చావదు. షుగర్ వచ్చి నక్క చావదు. కానీ నువ్వే పోతావ్..” అని పూరి వన్ మీల్ ఇంపార్టెన్స్‌ను ఈ ఆడియోలో వివరించారు.



