`అర్బ‌న్ మాంక్` స‌స్పెన్స్‌ రివీల్ చేసిన మెగాస్టార్

0
20

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లే గుండుతో అర్బ‌న్ మాంక్ గెట‌ప్‌లో క‌నిపించి రామ్ చ‌రణ్‌తో స‌హా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. చిరు స‌డెన్ గా ఇలా క‌నిపించే స‌రికి త‌ప్ప‌కుండా త‌న త‌దుప‌రి సినిమా కోసం ఇలా రెడీ అయ్యార‌ని ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంత‌లా అంద‌రినీ స‌ర్ఫైజ్ చేసిన చిరు అర్బ‌న్ మాంక్‌లా ఎలా మారాడు? అనే స‌స్పెన్స్‌ను రివీల్ చేశారు. “నిజమైన లుక్‌ అనిపించేలా తీర్చిదిద్దిన టెక్నిషియన్స్‌ అందరికి కృతజ్ఞతలు. సాల్యూట్‌ టు మ్యాజిక్‌ ఆఫ్‌ సినిమా’’ అని తెలుపుతూ `మేకింగ్ ఆఫ్ అర్బ‌న్ మాంక్` పేరుతో ఒక‌ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు మెగాస్టార్‌. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న`ఆచార్య`లో న‌టిస్తున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌‌ర‌లోనే షురూ కానుంది. మ‌రోవైపు`లూసిఫ‌ర్`,` వేదాళ‌మ్` రీమేక్ లలో న‌టించేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here