‘లంబసింగి’ మూవీ రివ్యూ

0
186

చిత్రం: లంబసింగి

విడుదల తేదీ: 15-03-2024

నటినటులు:భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, తదితరులు.

దర్శకత్వం:నవీన్ గాంధీ

సమర్పణ: కళ్యాణ కృష్ణ కురసాల 

నిర్మాత:ఆనంద్ టి

సంగీతం:ఆర్ఆర్ ధృవన్

సినిమాటోగ్రఫీ:కె. బుజ్జి

ప్రోమో, పోస్టర్, పాటలతో ఆకట్టుకున్న ‘లంబసింగి’ మూవీ నేడు, మార్చ్ 15న థియేటర్ లలో విడుదల అయింది. ‘బిగ్ బాస్’ దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తూ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. నవీన్ గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. భరత్‌ రాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం మార్చి 15 న ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ మూవీ ఎంత వరకు మెప్పించిందో తెలుసుకుందాం…

కథ :

కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన వీరబాబు (భరత్ రాజ్) కి లంబసింగి లో పోస్టింగ్ పడుతుంది. ఆ ఊరిలో బస్సు దిగగానే హరిత (దివి) ని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె ఓ మాజీ నక్సలైట్ కూతురు అని తెలుస్తుంది. ఆ ఊరిలో నక్సలైట్లు గా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అందులో దివి తండ్రి ఒకరు. అలాంటి వారితో పోలీసులు రోజూ సంతకాలు పెట్టించుకుని వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఈ పని వీరబాబుకి అప్పగిస్తారు. హరితని ప్రేమలో పడేయడానికి అతను కూడా రోజూ ఆమె తండ్రితో సంతకం పాటించడానికి ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు. హరిత ఆ ఊరి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఓ రోజు హరితకి తన ప్రేమని వ్యక్తపరచగా ఆమె అందుకు ఒప్పుకోదు. దీంతో నిరాశకు చెందిన వీరబాబు.. ఓ రోజు అతను మాత్రమే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉండగా.. కొందరు నక్సలైట్లు దాడి చేసి అక్కడ ఉన్న అక్రమ ఆయుధాలను తీసుకెళ్ళిపోతారు. అందులో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ ఎదురవుతుంది. అదేంటి? అసలు హరిత తన ప్రేమని ఎందుకు నిరాకరించింది? ఆమె గతం ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు:

నటీనటుల విషయానికి వస్తే.. ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించిన దివి కి, లంబసింగి లో ఆమెలోనీ సహజమైన నటిని ఆవిష్కరించే అవకాశం వచ్చింది. అందుకు తగ్గట్లే హరిత పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఆమె పాత్రలో ట్విస్ట్..లు కూడా ఉంటాయి. దర్శకుడు నవీన్ గాంధీ, దివి లోని నటిని కీలకమైన పాత్రలో చక్కగా ఆవిష్కరించారు. ఇక హీరో భరత్ కూడా వీరబాబు అనే పాత్రలో చాలా నేచురల్ గా నటించాడు. క్లైమాక్స్ లో ఇతని ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటాడు. అలాగే కామెడీతో కూడా అలరించడం విశేషం. ఇక వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో పరిధి మేర నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

దర్శకుడు నవీన్ గాంధీ ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా ‘లంబసింగి’ ని తెరకెక్కించాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ చాలా బాగా వచ్చాయి, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. 2 గంటల 2 నిమిషాల పాటు ప్రతి ప్రేక్షకుడు ‘లంబసింగి’ అనే ప్రపంచంలోకి వెళ్లిపోయేలా చేశాడు. ఆర్.ఆర్.ధృవన్ అందించిన సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఓ చిన్న సినిమాలో ఇలాంటి పాటలు ఉంటాయని, వింటామని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఒక్కసారి వినగానే ప్రతి పాట హాంట్ చేసేలా ఉంటుంది. తెరపై కూడా వాటిని అందంగా ప్రెజెంట్ చేశాడు కెమెరామెన్ కె.బుజ్జి. ఎడిటర్ విజయ్ వర్ధన్ కావూరి కూడా తన పనితనంతో మెప్పించాడు.

విశ్లేషణ :

‘లంబసింగి’ కోసం దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న పాయింట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో మొదట కొంచెం స్లోగా అనిపించినా.. తర్వాత వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు డిజైన్ చేసిన తీరు బాగుంది. కొన్ని వన్ లైన్స్ కూడా బాగా పేలాయి. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ కట్టిపడేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం మొదటి నుండి ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు దర్శకుడు. ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడే టైం ఇవ్వడు. స్క్రీన్ ప్లేని చాలా పగడ్బందీగా డిజైన్ చేసుకున్నాడు. వీరబాబు, రాజు గారు పాత్రలతో చేయించిన కామెడీ అలరిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకుడు ఆ ఫీల్ ను క్యారీ చేస్తూ వస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు.

రేటింగ్ : 3/5

చివరిగా : ప్రేక్షకుడిని మరో ప్రపంచం లోకి తీసుకెళ్ళి అలరించే ‘లంబసింగి’ !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here