హీరో సుమన్ కు 2026 ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం’
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ పోరం ‘మరియు భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా, ప్రతి సంవత్సరం కళా పుపూర్ణ కత్తి కాంతారావు జన్మదినోత్సవాన్ని పునస్కరించుకుని గత 24 సంవత్సరాలుగా పలువురు సినీ ప్రముఖులను సన్మానిస్తూ కత్తి కాంతారావు పేరున జాతీయ పురస్కారాలను అందిస్తున్నది. కాగ 2026 జాతీయ పురస్కారానికి గాను ఎంపికయిన నటుడు హీరో సుమన్ గారు… సుమారు 300కు పైగా తెలుగు ..తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించి, పౌరాణిక పాత్రలైన శ్రీవేంకటేశ్వర స్వామిగా.. శ్రీ రాముడిగా …శ్రీకృష్ణుడిగా, యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా, యాక్షన్ చిత్రాల హీరోగా, కరాటే యోధుడు అయిన సుమన్ అనేక పాత్రలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించుకున్న నటుడు సుమన్ కు ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం’ తో సత్కరించాలని తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ పోరం మరియు భారత్ కల్చరల్ అకాడమీ గౌరవ సభ్యులు తీర్మానించారు. ఈ అవార్డ్ ను హైదరాబాద్ లో కాంతారావు పుట్టిన రోజైన నవంబర్ 16వ తేదీన ప్రధానం చేయనున్నట్టు అవార్డు కమిటి చైర్మెన్ K.V.రమణా చారి..(IAS) కో చైర్మన్స్ సి.పార్థసారథి. IAS(Rtd) నాగబాల డి. సురేష్ కుమార్ లు ఒక ప్రకటనలోతెలియ జేసారు.



