‘ద గోట్ లైఫ్ ఆడుజీవితం’ మూవీ రివ్యూ

0
580

బెన్యామిన్ రచించిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మూవీపై క్యూరియాసిటిని కలిగించాయి. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్  దాదాపు 31 కేజీల బరువు తగ్గి పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇందులో అమలా పాల్ కథానాయికగా నటించింది. నేడు థియేటర్ లలోకి వచ్చిన ఆడుజీవితం చిత్రాన్ని తెలుగు లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మార్చ్ 28న విడుదల చేశారు.

కథ:

గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లి భార్యనీ, అమ్మని బాగా చూసుకుందాం అనుకున్న నజీబ్ ముహమ్మద్ (పృథ్వీరాజ్ సుకుమారన్), భాష రాకపోవడం వలన గల్ఫ్ కీ వెళ్ళీ వెళ్ళగానే ఎలా ఒక బానిసగా ఇరుక్కుపోయాడు, ఎటు చూసినా ఎడారి తప్ప ఇంకేమీ కనిపించని ప్రదేశంలో కనీసం నీరు కూడ దొరకని స్థితిలో తను అనుభవించిన భాధలు, వాటిని తట్టుకోలేక ఎలా అక్కడి నుండి బయట పడడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నంలో తను ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఏలా చివరికి బయటపడ్డాడు అనే నేపథ్యంలో కథ ఉంటుంది.

నటీనటుల పనితీరు:

నజీబ్ పాత్రకి న్యాయం చేయడం కోసం పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టారని చెప్పొచ్చు, తన శరీరాకృతి నీ  నిజంగా కొన్ని సంవత్సరాలు ఎడారిలో నరకయాతన పడి, తిండి, స్నానం లేని శరీరం ఎలా కృంగి కృసించుకుపోతుందో కళ్ళకు కట్టినట్టు పృథ్వీ రాజ్ తన నటనతో జీవించారు.  నజీబ్ తో పాటు ఊరు నుండి వచ్చిన హకీమ్ పాత్రధారి కూడా అద్భుతంగా చేశారు. సెకండ్ హాఫ్ లో వచ్చిన ఇబ్రహీం ఖాద్రీ పాత్ర ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది, ప్రి క్లైమాక్స్ లొ ఆ పాత్ర అదృస్యమైనప్పుడు ప్రేక్షకులు కొంచం సేపు మళ్ళీ ఆ పాత్ర వస్తె బాగుండు అని ఫీల్ అయ్యారంటే ఆ పాత్ర ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ద గోట్ లైఫ్ (ఆడుజీవితం)- సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే పాత్రలు అన్ని కూడా డిజైన్ చేశారు దర్శకుడు బ్లెసీ. వాస్తవ కథ అయినప్పటికీ లీనియర్ గా తీసుకొని వెళ్లకుండా ఓపెనింగ్ షాట్ తోనే కథలోకి ప్రేక్షకులు వెళ్లేలా బిగి సడలని స్క్రీన్ప్లే తో కట్టిపడేసారు.  పాత్ర కి భాష రాకపోవడం వలన తాను పడే ఇబ్బంది ప్రేక్షకులకు అర్థమై, ప్రేక్షకులు కూడా అదే ప్రపంచంలోకి వెళ్లేలా అరబిక్ భాష వచ్చిన ప్రతి సారీ సబ్ టైటిల్స్ వేయలేదు. సినిమాతో, ఆ పాత్రతో ప్రేకకుడు కనెక్ట్ అవడానికి, పాత్రతో కలిసి ప్రయాణించడానికి చేసిన ఈ ప్రయత్నం మాస్టర్ స్ట్రోక్.

అద్భుతమైన సాంకేతిక అంశాలు ఈ సర్వైవల్ డ్రామా కి చాలా పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి, రెహమాన్ సంగీతం కి సరిసమానంగా ఆ ఏంబియన్స్ నీ మనం ఫీల్ అయ్యేలా ఉంది రసూల్ పూకుట్టి అందించిన సౌండ్ డిజైన్. కెమెరామన్ సునీల్ ఆ ఏడాది లైఫ్ నీ థియేటర్ లో ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసేలా ఫ్రేమ్స్ అధ్భుతంగా పెట్టారు.  సినిమాలో తెలీకుండా చాలా వి ఎఫ్ ఎక్స్ ఉంది. కానీ అస్సలు VFX చేసినట్టే ఎక్కడా అనిపించలేదు..

మధ్య మధ్యలో కొంచెం స్లో అయినట్లు అనిపించినా . తెర మీద పాత్రలు పడే సంఘర్షణను ఒక సర్వైవల్ డ్రామా లో చూపించాలంటే ఆ మాత్రం డీటైలింగ్ లేకపోతే డ్రామా పండించడం కష్టమే, నిజానికి ఆ స్లో నేరేషన్ కూడా ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటి నీ ప్రేక్షకులలో పెంచేలా చేసింది..

రేటింగ్: 3.5/5

చివరగా: స్ఫూర్తి నీ నింపే ఆడుజీవితం లో పృథ్వీరాజ్ నట విశ్వరూపం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here