‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ మూవీ రివ్యూ

0
192

చిత్రం: బాబు నెం.1 బుల్ షిట్ గయ్

నటీనటులు: అర్జున్ కల్యాణ్, కుషిత కల్లపు

విడుదల తేదీ: 08-03-2024

బ్యానర్ – డీడీ క్రియేషన్స్
నిర్మాత – దండు దిలీప్ కుమార్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత – డి లక్ష్మీ నారాయణ (బుజ్జి)
దర్శకుడు – MLR (లక్ష్మణ వర్మ)
D.O.P – PS మణికర్ణన్
ఎడిటర్ – డి వెంకట ప్రభు
సంగీత దర్శకుడు – పవన్
ఆదిత్య మ్యూజిక్ – మాధవ్ & నిరంజన్
ఈవెంట్ పార్టనర్ – హనుమాన్ డిజిటల్ మీడియా
డిజిటల్ పార్టనర్ – సిల్లీ మాంక్స్
ప్రొడక్షన్ కంట్రోలర్: అమ్మ సీను

కామెడీ డ్రామాతో ఆకట్టుకునే బిగ్ బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు జంటగా… లక్ష్మణ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, కామెడీ, డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ:

కార్తీక్ బాబు(అర్జున్ కల్యాణ్)… అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగొచ్చే ఓ రిచ్ గాయ్. అప్పుడే ఇండియాలో కరోనా ప్రభావం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. తనకి అవుట్ స్కట్స్ లో పేద్ద విల్లా ఉంటుంది. ఇండియాకు వచ్చిన కార్తీక్ బాబును కొన్నాళ్లపాటు ఆ విల్లాలో ఉండాలని తండ్రి(రవి వర్మ) సూచిస్తారు. దాంతో కార్తీక్… తన ప్రేయసి కుషిత(కుషిత కల్లపు) కలిసి విల్లాలో ఉండాలనుకుంటారు. ఇద్దరూ త్వరలోనే పెళ్లికూడా చేసుకోవాలనుకునే ఈ జంట… లాక్ డౌన్ కారణంగా ఆర్నెళ్లకు సరిపడా సరుకులన్నీ ఏర్పాటు చేసుకుని విల్లాలో సెటిల్ అవుతారు. ఇంతలో ప్లంబర్ రూపంలో వచ్చిన సోంబాబు(ఈ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ) వీరిద్దరిని కిడ్నాప్ విల్లాలో బంధించి ఆ బంగ్లాలో సెటిల్ అయిపోతారు. మరి ఇలా బంధించబడిన కార్తీక్, కుషితలు ఎలా బయటపడ్డారు? వారు బంధించబడటానికి గల కారణాలు ఏంటి? అసలు సోంబాబు ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

అర్జున్ కల్యాణ్, కుషిత జంట చాలా రొమాంటిక్ గా కనిపించి యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మీద తీసిన సాంగ్ కూడా బాగుంది. ఎప్పుడూ ఇన్ స్టాలో కుషిత అందాలు చూసిన వారికి… ఇందులో చూసి ఎంటర్ టైన్ అవ్వొచ్చు. అర్జున్ కల్యాణ్ తన పరిధి మేరకు నటించి మెప్పించారు. అర్జున్ చాలా ఎనర్జిటిక్ గా నటించారు. అమెరికా నుంచి రిటర్న్ అయిన అబ్బాయిలు ఎలా ఉంటారో… అలానే చాలా పోర్ష్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇందులో ఈ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ కూడా హీరో సమాన స్థాయి రోల్ పోషించారు. అతనికి జంటగా సోనాలి పాణిగ్రాహి నటించి మెప్పించింది. వీరిద్దరి మీద తీసిన పాటు, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలన్నీ యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. అతనికి తమ్ముడిగా నటించిన వ్యక్తి కూడా కొంత యాంటి టచ్ ఉన్న రోల్ లో బాగానే నటించారు. కమెడియన్ భద్రం కాసేపు అక్కడక్కడ కనిపించి నవ్వించారు. జబర్దస్థ్ అప్పారావు పాత్ర కూడా పర్వాలేదు. హీరో తండ్రి పాత్రలో రవి వర్మ ఎప్పటిలాగే తన మార్క్ రౌద్రంతో నటించి మెప్పించారు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి ఆకట్టుకుంటారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

దర్శకుడు లక్ష్మణ్ వర్మ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే బాగున్నాయి. కుటుంబంతో కలిసి చూసే చాలా సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఇందులో చిన్న మెసేజ్ కూడా ఇచ్చారు. సరదగా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేయొచ్చు. పి.ఎస్.మణికర్ణన్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. అర్జున్, కుషిత జంటను చాలా అందంగా… రొమాంటిక్ గా చూపించారు. అలాగే లక్ష్మణ్ వర్మ-సోనాలి పాణిగ్రాహి జంటను మాస్ గా… ఓ పేద కుటుంబం ఎలా ఉంటుందో బాగా క్యాప్చర్ చేసి చూపించారు. పవన్ సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. నిర్మాత దండు దిలీప్ కుమార్ రెడ్డి సినిమాని ఖర్చుకి వెనకాడకుండా తీశారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

విశ్లేషణ:

యాక్షన్ కామెడీ డ్రామా సినిమాలకు పెద్దగా మెయిన్ ప్లాట్ అవసరం లేదు. ఇన్ స్పైర్ అయిన చిన్న పాయింట్ ను మెయిన్ ప్లాట్ గా తీసుకుని… దాని చుట్టూ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేను రాసుకుంటే… ఆడియన్స్ ను థియేటర్లో రెండు గంటలపాటు కూర్చోబెట్టొచ్చు. డ్రామాకి తోడు సరదాగా నవ్వుకునే కామెడీ సీన్లు ఉంటే… ప్రేక్షకులు బాగా ఎంటర్ టైన్ అవుతారు. దర్శకుడు లక్ష్మణ్ వర్మ చేసింది కూడా అదే. కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టిన సమయంలో తన ఇంటి వద్దకు వచ్చిన పిచ్చుకలను చూసి ఇన్ స్పైర్ అయ్యి రాసుకున్న ఓ చిన్న పాయింట్ మీద… కథ… స్క్రీన్ ప్లేను చాలా ఆసక్తికరంగా రాసుకుని తెరకెక్కించారు. ఓ అందమైన జంటను గదిలో బంధించి… ఆ అందమైన బంగ్లాలో తన కుటుంబంతో కలిసి దర్జాగా జీవించే ఓ తాపీ మేస్త్రీ సోంబాబు… కూడా నైతిక విలువలు వుంటాయని చివర్లో చూపించారు. కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారం, డబ్బులు కళ్లెదుటే ఉన్నా… అవేవి తనకు అక్కర్లేదని, కేవలం తనకు వచ్చిన కష్టకాలంలో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఆ బంగ్లాలో ఉండాల్సి వచ్చిందని సింపుల్ గా వెళ్లిపోయే సోంబాబు జీవిత పాఠం… చివర్లో చిన్న మేసేజ్ కూడా కార్తీక్ బాబు వాయిస్ రూపంలో ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ట్రాక్ తో మొదలై… సోంబాబు లవ్, తన ప్రేయసి సోనాలి పాణిగ్రాహితో వివాహం తదితర అంశాలతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. సెకెండాఫ్ లో కొంత కుటుంబ డ్రామా… యాక్షన్ తదితర వాటితో ముగించారు. ఓ వరాల్ గా ‘బాబు నెం.1 బుల్ షిట్ గాయ్’ ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తాడు.

రేటింగ్: 3/5

చివరగా: అలరించే కామెడీ ఫామిలీ డ్రామా

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here