యమధీర మూవీ రివ్యూ

0
145

చిత్రం: యమధీర

తారాగణం :
కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్, తదితరులు.

టెక్నికల్ టీం :
ప్రొడక్షన్ : శ్రీ మందిరం ప్రొడక్షన్స్
కెమెరామెన్ : రోష్ మోహన్ కార్తీక్
మాటలు & పాటలు : వరదరాజ్ చిక్కబళ్ళపుర
ఎడిటింగ్ : సి రవిచంద్రన్
సంగీతం : వరుణ్ ఉన్ని
నిర్మాత : వేదాల శ్రీనివాస్ రావు గారు
కథ & దర్శకత్వం : శంకర్ ఆర్
పి ఆర్ ఓ : మధు VR

పొలిటికల్ డ్రామా, ఈవీఎంల ట్యాంపరింగ్ నేపథ్యంలో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన యమధీర మూవీ ట్రెయిలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది. కెపి గౌతమ్, క్రికెటర్ శ్రీశాంత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు, 23 మార్చ్ న థియేటర్లలో విడుదల అయింది. సినిమా ఎలా ఉందో సమీక్ష లో చూద్దాం.

కథ :

కెపి గౌతమ్ ( కోమల్ కుమార్) అన్యాయాన్ని ఎదుర్కొనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.  వైజాగ్ కమిషనర్ గా వచ్చిన గౌతమ్ ఒక యువకుడి మిస్టరీ డెత్ కేస్ రీఓపెన్ చేసి పరిష్కరించే క్రమంలో అజర్ బైజాన్ దేశంలో ఉన్న దేశముఖ్ (క్రికెటర్ శ్రీశాంత్) కి ఆ హత్య తో సంబంధం ఉందని తెలుసుకుంటాడు. అదేవిధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయించి దేశముఖ సీఎం అవుతాడు. తన పై అధికారి అయిన నాగబాబు సపోర్ట్ తో ఆ కేసును గౌతమ్ సాల్వ్ చేశాడా లేదా? దేశముఖ్ కి ఆ యువకుడు హత్యకి సంబంధమేంటి? సీఎం హోదాలో ఉన్న దేశముఖ్ నీ గౌతమ్ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

హీరోగా కోమల్ కుమార్ పోలీస్ పాత్రలో ఆకట్టుకున్నారు. అమ్మ సెంటిమెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా చేశారు. నెగిటివ్ రోల్ లో క్రికెటర్ శ్రీకాంత్ చాలా బాగా నటించాడు. రిషిక శర్మ తన పరిధి మేరకు మంచి నటనను కనబరిచింది. మూగ వ్యక్తి పాత్రలో ఆలీ పండించిన కామెడీ అలరిస్తుంది. నాగబాబు, మధుసూదన్ రావు, సత్య ప్రకాష్, పృథ్వీరాజ్ ఎవరు పరిధికి వారు బాగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

కన్నడ సినిమా అయినా తెలుగు నేటివిటీ మిస్ అవకుండా చూసుకున్నారు. శ్రీ మందిరం ప్రొడక్షన్స్ పై వేదాల శ్రీనివాసరావు నిర్మాతగా ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్ తో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. డి ఓ పి గా రోష్ మోహన్ కార్తీక్ పనితీరు బాగుంది. వరుణ్ ఉన్ని అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్. శంకర్ ఆర్ ఎంచుకున్న కథ దర్శకత్వం చాలా బాగున్నాయి. వరదరాజ్ చిక్కబళ్ళపుర అందించిన డైలాగ్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కోమల్ కుమార్, క్రికెటర్ శ్రీశాంత్ ల నటన
అలీ కామెడీ
ఆర్ శంకర్ కథ దర్శకత్వం
మదర్ సెంటిమెంట్, పొలిటికల్ డ్రామా
యాక్షన్ సీక్వెన్స్

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ ఉన్న లాగ్ సీన్స్
శ్రీశాంత్ పాత్ర నిడివి తక్కువ ఉండడం
సాంగ్స్

రేటింగ్ : 3.25/5

చివరగా:  ఈవీఎం ల ట్యాంపరింగ్ గురించి జనాలకి అవగాహన కలిగించే కమర్షియల్ ఎంటర్టైనర్ యమధీర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here