క‌రోనాపై పోరాటం కోసం రూ. 30 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన హీరో నారా రోహిత్‌

0
432
Nara Rohith Announced 30 Lakhs

కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హీరో నారా రోహిత్ పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో త‌న వంతుగా రూ. 30 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధుల‌కు చెరో రూ.10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలిపారు.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌ల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అంద‌రూ త‌ప్ప‌కుండా పాటించాలని ప్ర‌జ‌ల‌ను ఆయ‌న కోరారు. మనం పాటించే స్వీయ నియంత్రణే మనకు శ్రీ రామరక్ష అన్నారు. అందరం సమష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here