‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ చిత్రంలోని రామ శ్రీరామ పాటను విడుదల చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు కోటి !!!

0
237
Annapurnamma gari Manavadu song

సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలలో నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎమ్.ఎన్. ఆర్ చౌదరి నిర్మించిన చిత్రం అన్నపూర్ణమ్మ గారి మనవడు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రంలోని రామ శ్రీరామ పాటను విడుదల చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు.

ఈ సందర్భంగా కోటి గారు మాట్లాడుతూ…
“ఎన్నో విజయవంతమైన చిత్రాలను దర్శకత్వం వహించిన నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) తీసిన అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. రామ శ్రీరామ అనే చక్కటి సాంగ్ నేను విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. మంచి కథ బలం ఉన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాము, భవిసత్తులో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి, ఈ చిత్ర నిర్మాత ఎమ్.ఎన్. ఆర్ చౌదరి గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను” అన్నారు.

ప్రేక్షకుల అభిరుచికి తగ్గ పలు చిత్రాలను రూపొందించిన దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) పల్లెటూరి ప్రేమలను వాతావరణాన్ని ప్రతింబించే విధంగా అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మాస్టర్‌ రవితేజ మనవడి పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. బడ్జెట్‌ ఎక్కువైనా నిర్మాత ఎమ్మెన్నార్‌ చౌదరి ఎక్కడా రాజీపడకుండా సినిమా బాగా రావాలని ఈ మూవీని రూపొందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here