క‌రోనా క్రైసిస్ చారిటీకి యంగ్ హీరో సందీప్ కిష‌న్ రూ. 3 ల‌క్ష‌ల విరాళం

0
394
Sundeep kishan announced 3 Lakhs

పేద సినీ క‌ళాకారులు, కార్మికుల‌ను ఆదుకోవ‌డంలో యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ భాగ‌స్వాముల‌య్యారు. ప్రస్తుతం న‌డుస్తున్న సంక్షోభ కాలంలో సినిమా షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సినీ కార్మికుల‌కు చేయూత నిచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ఛైర్మ‌న్‌గా ఏర్పాటైన క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి సందీప్ కిష‌న్ రూ. 3 ల‌క్ష‌లు విరాళంగా ప్ర‌క‌టించారు.

దీంతో పాటు ‘వివాహ భోజ‌నంబు’ రెస్టారెంట్ల‌లో ప‌నిచేస్తున్న 500కు పైగా ఉద్యోగుల బాగోగుల‌ను సైతం ఆయ‌న చూసుకుంటున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్ర‌స్తుతం కీల‌క ద‌శ‌లో ఉంద‌నీ, దీన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌ల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అంద‌రూ గౌర‌వించాల‌నీ, వైద్యులు, పోలీసుల సూచ‌న‌ల‌ను పాటిస్తూ, అంద‌రూ త‌మ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌నీ సందీప్ కిష‌న్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here