టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే రేపు తన 34వ పుట్టినరోజుని జరుపుకోనున్న రామ్ చరణ్ కు ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అడ్వాన్స్ గా విషెస్ తెలిపారు.
చిన్నప్పటి చరణ్ ని తాను ఎత్తుకుని ఉన్న ఫోటో ని షేర్ చేసిన మెగాస్టార్, అందరి తండ్రుల వలే తనకు కూడా చరణ్ పుట్టినపుడు ఎంతో సంతోషం కలిగిందని, అయితే సరిగ్గా మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజునే చరణ్ ఎందుకు పుట్టాడో తనకు ఆ తరువాతనే అర్ధం అయిందని, చేప పిల్లకు ఈత నేర్పవలసిన అవసరం లేకుండా తన అనంతరం చరణ్ కూడా యాక్టింగ్ లో అదరగొడుతున్నాడని గుర్తుచేసుకుంటూ రామ్ చరణ్ కు అడ్వాన్స్ విషెస్ తెలిపారు మెగాస్టార్. ఇక మెగాస్టార్ పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతోంది…..!!