మెగాపవర్ స్టార్ చరణ్ బర్త్ డే కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ సర్ప్రైజ్……!!

0
630
Jr. NTR Surprise Gift for Charan

ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న భారీ ప్రతిష్టాత్మక హిస్టారికల్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రేపు తన జన్మదినాన్ని జరుపుకోనున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశం మొత్తం లాక్ డౌన్ చేయడంతో అధికారిక వేడుకలను రద్దు చేసుకున్న చరణ్, ఇంట్లోనే తన కుటుంబసభ్యులతో కలిసి పుట్టినరోజు పండుగ జరుపుకోనున్నారు. ఇకపోతే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కు ‘రౌద్రం రణం రుధిరం’లో కొమరం భీంగా నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేక సర్ప్రైజ్ ని రేపు ఉదయం 10 గంటలకు యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు అందించనున్నారు.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో తన మిత్రుడు చరణ్ పుట్టిన రోజుని ఎంతో ఘనంగా జరిపే అవకాశం లేనప్పటికీ, రేపు తాను ఇచ్చే బర్త్ డే సర్ప్రైజ్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటికీ మరిచిపోలేరని ఎన్టీఆర్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిన్న నేను ట్విట్టర్ లో జాయిన్ అయి ఉండకపోతే, రేపు నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ ని మిస్ అయి ఉండేవాడిని అంటూ ఎన్టీఆర్ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ చరణ్ ఒక పోస్ట్ చేసారు. అయితే అల్లూరికి కొమరం భీం ఇచ్చే ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని అప్పుడే మెగా, నందమూరి ఫ్యాన్స్ అప్పుడే పలు ఆలోచనలతో సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here