అభిమాని నూర్ మహమ్మద్ కుటుంబానికి రామ్ చరణ్ రూ.10 లక్షల సాయం…!

0
705

మెగాస్టార్ చిరంజీవి అభిమాని గా కొన్నేళ్లుగా కొనసాగుతున్న నూర్ మొహమ్మద్, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షిగా ఎంపికయి, అక్కడినుండి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మెగాస్టార్ చిరంజీవి అభిమాని నూర్, ఇటీవల గత ఏడాది నవంబర్ 8న హఠాత్తుగా మరణించారు. ఆ విషాద వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ కూడా నూర్ మరణం పై నివాళులు అర్పించడం జరిగింది.

అయితే అదే సందర్భంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ, నూర్ గారు మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు, నాన్న గారి దగ్గరి నుండి మా కుటుంబానికి పెద్ద అభిమానిగా కొనసాగుతూ, మెగా అభిమాన సంఘం తరపున పలు సేవ కార్యక్రమలు నిర్వహించిన నూర్ గారిని ఎప్పటికీ మరిచిపోలేమని, కావున కుటుంబానికి తనవంతుగా సాయం అందిస్తానని మాటిచ్చిన చరణ్, నేడు నూర్ కుటుంబ సభ్యులను కలిసి, వారికి రూ.10 లక్షల రూపాయల చెక్ ని అందించడం జరిగింది. కాగా అభిమాని కుటుంబానికి సాయం అందించి అండగా నిలిచిన రామ్ చరణ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి…….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here