కరోనా వైరస్(కోవిడ్ 19) నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్ ఇప్పటికే తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.5 లక్షలు చొప్పున విరాళం అందజేస్తానని ఆయన వెల్లడించారు. దర్శకుడు సుకుమార్ ఈ 10 లక్షల విరాళం విరాళం ను ప్రభుత్వాలకు త్వరలోనే అందజేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు.