‘వృషకర్మ’ తప్పకుండా థియేటర్లలోనే చూడాల్సిన లార్జ్ స్కేల్ సినిమా. అందరూ గర్వపడే సినిమా చేశాం. డిసెంబర్ 4న ఆడియన్స్‌కు గొప్ప విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి వచ్చి థియేటర్లలో ఎంజాయ్ చేయండి: మీడియా మీట్లో యువ సామ్రాట్ నాగచైతన్య
యువ సామ్రాట్ నాగచైతన్య మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వృషకర్మ’. పురాతన రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘విరూపాక్ష’తో విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, బాపినీడు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలను పెంచింది. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్ మీడియా మీట్ నిర్వహించారు.
మీడియా మీట్ లో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా అభిమానులకు, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ థాంక్యూ వెరీ మచ్. ఈ కథ విన్న తర్వాత కార్తీక్ విజన్‌ను నమ్మి ముందుకు వెళ్తున్నాను. ఒక పాయింట్ తర్వాత కథ కూడా మర్చిపోయి పూర్తిగా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయాను. తను ఏం చెప్తే అది చేశాను. నాకు కార్తీక్ మీద అంత నమ్మకం ఉంది. మేము నమ్మిన కథ కోసం పడిన హార్డ్ వర్క్‌ను ఆడియన్స్‌కు ఎప్పుడు చూపించాలా అనే ఎక్సైట్మెంట్తో పనిచేశాం. ట్రైలర్ తో అందరి రెస్పాన్స్ చూసి ఎంతో హ్యాపీగా ఫీలయ్యాను. ట్రైలర్ కనెక్ట్ అయిందంటే సినిమా కూడా ఇలాగే సెలబ్రేట్ చేస్తారని నమ్మకం ఉంది. ఈ సినిమా కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ అటెంప్ట్. మేమందరం మా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఒక కొత్త సినిమా ఇవ్వాలి, ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ప్రయత్నంతో కష్టపడి పనిచేశాం. టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. అలాగే నటీనటులందరికీ కూడా థాంక్యూ. మీనాక్షి, జయరాం గారు.. అందరూ రాత్రింబవళ్లు పనిచేశారు. ఎంత హార్డ్ వర్క్ చేసినా, అది మంచి ఫలితాన్ని ఇచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా ఇంత అద్భుతమైన అవుట్‌పుట్ చూశాక ఆ ఫీలింగ్ కలిగింది. ఎప్పటినుంచో ఒక లార్జ్ స్కేల్ సినిమా చేయాలని, అలాంటి సినిమా నా కెరీర్లో పడాలని కోరుకున్నాను. ‘వృషకర్మ’తో అలాంటి సినిమా వచ్చింది. ఈ సందర్భంగా మా నిర్మాత ప్రసాద్ గారికి, డైరెక్టర్ కార్తీక్‌కు థాంక్యూ. ఇది ఎప్పటికీ మర్చిపోలేని అవకాశం. డిసెంబర్ 4న థియేటర్లలోనే ఎంజాయ్ చేయండి. కచ్చితంగా ఇది థియేటర్ సినిమా. మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి థియేటర్లలో ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పినప్పుడు కార్తీక్ భారతదేశంలోనే ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేఒక టాప్ డైరెక్టర్ అవుతాడని అనిపించింది. అదే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పాను. ఈ సినిమాలో నేను, కియారా, జయరాం గారు, మీనాక్షి పాత్రల మధ్య చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఈ సినిమా కథ చెప్తున్నప్పుడు ముందుగా మేము నమ్మింది ఆ ఎమోషన్‌నే. అదే ఈ కథకు ప్రాణం. ఇందులో నేను చేసిన అర్జున్ క్యారెక్టర్ మెంటల్‌గా నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఇది విజువల్ ఎఫెక్ట్స్‌కు చాలా స్కోప్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాలు చేయడం యాక్టర్‌కు చాలా ఛాలెంజింగ్. అయితే మా డైరెక్టర్, టెక్నీషియన్స్ అందరి సపోర్ట్‌తో అద్భుతంగా చేయగలిగాం.
డైరెక్టర్ కార్తీక్ దండు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ కి మీరు ఇచ్చిన రెస్పాన్స్‌కు థాంక్యూ. ఈ స్పందనతో మా బాధ్యత మరింత పెరిగింది. నిజంగా మీ అంచనాలకు మించి సినిమా ఉండబోతోంది. చైతు గారికి ఈ కథ చెప్పినప్పుడు.. ఇండియన్ సినిమాలో గర్వంగా చెప్పుకునే సినిమాతో వస్తున్నాము, అందులో నేను కూడా భాగమవుతున్నాననే ఆనందం కలిగిందని అన్నారు. డిసెంబర్ 4న మేమందరం ఒక మంచి సినిమాను ఇవ్వబోతున్నాం. తెలుగు సినిమా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్. తప్పకుండా అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. చాలా కొత్త స్క్రీన్‌ప్లేను ప్రజెంట్ చేస్తున్నాం. కచ్చితంగా మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. మీకు మంచి అడ్రినలిన్ రష్ ఉంటుంది. సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. నిజంగా ప్రాణం పెట్టి పనిచేశాం. ‘విరూపాక్ష’ ఒక రకమైన హారర్ సినిమా. ఇది మరో తరహ హారర్ జానర్ సినిమా. కచ్చితంగా మీకు గొప్ప థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. సక్సెస్ మీట్లో అందరి గురించి వివరంగా మాట్లాడుతాను. కచ్చితంగా మీరందరూ సినిమాను థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తొలి పది నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దని కోరుతున్నాను. కొంతమంది థియేటర్‌కు లేటుగా వస్తుంటారు. మీరు ఈ సినిమాను మొదటి సెకండ్ నుంచే చూస్తే ఒక ఫ్లోలో వెళ్తుంది. ఎవరూ కూడా తొలి పది నిమిషాలను మిస్ కావద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను.
హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ముందుగా టీమ్ అందరికీ థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది టీమ్ వర్క్. మా డైరెక్టర్ గారు, డీఓపీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సినిమాను మరో స్థాయికి ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో విజువల్స్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఆ క్రెడిట్ మా డైరెక్టర్ కార్తీక్ గారికి దక్కుతుంది. దక్ష లాంటి క్యారెక్టర్ చేయడం జీవితంలో ఒకసారి వచ్చే అవకాశం. ఇది చాలా డిఫరెంట్ జోనర్లో వస్తున్న సినిమా. ఇందులో నటించడం అద్భుతమైన అనుభూతి. మా నిర్మాత గారు అందరినీ ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేశారు. నాగచైతన్య గారు అందరికీ ఫేవరెట్. ఆయన వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, వండర్ఫుల్ యాక్టర్. నిజంగా బంగారం. వర్క్‌షాప్ నుంచే ఈ సినిమాకు చాలా కంఫర్టబుల్‌గా పనిచేశాం. ఆయనతో వర్క్ చేయడం బెస్ట్ ఎక్స్పీరియన్స్. అర్జున్ లాంటి క్యారెక్టర్లో చైతన్య గారిని ఒక డిఫరెంట్ అవతార్‌లో చూడబోతున్నారు. ఈ సినిమా కచ్చితంగా ఒక బెంచ్‌మార్క్ అవుతుంది.
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. కార్తీక్ అద్భుతమైన కథ రాశారు. చైతన్య గారు ఆ కథను బలంగా నమ్మారు. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చాలా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాం.
స్పర్శ్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా అద్భుతమైన సినిమా తీశాం. మీరు ఇప్పటికే టీజర్, ట్రైలర్ చూశారు. ఇంత గొప్ప సినిమాతో తెలుగులో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. నాగచైతన్య గారితో కలిసి పనిచేయడం చాలా అద్భుతమైన అనుభూతి. కచ్చితంగా ఈ సినిమా మీకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.”
ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ..టీజర్, ట్రైలర్‌కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ‘విరూపాక్ష’ రిలీజ్ అయిన తర్వాత ఎంత అప్రిషియేషన్ వచ్చిందో, ఇప్పుడు ‘వృషకర్మ’ టీజర్, ట్రైలర్‌కే అంత అప్రిషియేషన్ వస్తోంది. ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్లు ఫోన్ చేసి సినిమాను అభినందించారు. తెలుగు సినిమాను ఇంత అద్భుతమైన క్వాలిటీతో చేశారని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. మా నిర్మాతల సపోర్ట్‌ను మర్చిపోలేను. వారు చాలా అద్భుతమైన సహకారం అందించారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు చైతన్య గారు ఇచ్చిన సపోర్ట్ చాలా బలాన్ని ఇచ్చింది. ఆయన చాలా గొప్ప ఎనర్జీ ఇచ్చారు.
డీఓపీ రాగుల్ డి హెరియన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ గారికి ముందుగా థాంక్స్. నేను కథకు న్యాయం చేశానని భావిస్తున్నాను. అలాగే మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఇలాంటి సినిమా చేయాలంటే చాలా విజన్, కన్విక్షన్, ప్యాషన్ కావాలి. నాగచైతన్య గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు అద్భుతమైన వరల్డ్‌ను క్రియేట్ చేశారు. ప్రొడక్షన్ టీమ్ అందరికీ థాంక్యూ. వారు ఎంతో హెల్ప్ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోంది.



