సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి గారు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ప్రారంభమైన విలన్ హౌస్ తాలూకు తాజా షెడ్యూల్ సక్సెస్ఫుల్ గా పూర్తి అయిందని,
ఇక కేవలం ఆఖరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది, యూనిట్ మొత్తం ఆ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతున్నారు అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ప్రకటన రిలీజ్ చేశారు. దానితో పాటు రాబోయే దీపావళి సందర్భంగా తమ సినిమా నుండి ఒక పెద్ద సర్ప్రైజ్ ట్రేట్ కూడా ఉండబోతోందని ఆయన తన పోస్ట్ లో తెల్పడం జరిగింది. అయితే అది పోస్టరా, లేక సాంగ్ టీజరా, ఏమైఉంటుందబ్బా అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే ఆలోచించడం మొదలెట్టేసారు. ఇక అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు…..!!


