వెండితెరపై కనిపించిన ప్రతి యాక్టర్ అభిమానుల్లో ఏదో ఒక యాంగిల్ లో గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే సినిమాల్లో ఎలా కనిపించినా.. ‘మా దేవుడు’ అనేలా క్రేజ్ తెచ్చుకునే కథానాయకులు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు అలాంటి వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. సినిమాల్లో చెప్పే మంచి మాటలే ఆయన నిజ జీవితంలో కూడా పాటిస్తారని మారోసారి రుజువు చేశారు.
ఇటీవల తమిళనాడులో తుపాను కారణంగా ఎంతో మంచి పేద ప్రజలు నిరాశ్రయులయ్యారు. అప్పట్లోనే రజినీకాంత్ ప్రభుత్వానికి విరాళం అందించాడు. ఇక మరికొంత మంది నిరుపేదలకు ఇప్పుడు ఇళ్లను నిర్మిస్తూ తన మానవత్వాన్ని చాటుకున్నారు. తలైవా అనే పదానికి సరైన అర్ధం చెప్పారు. నాగపట్టినంలోని పది కుటుంబాలకు ప్రత్యేకంగా ఇళ్లను నిర్మించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ కి సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కష్టాల్లో ఉన్న నిర్మాత కళైజ్ఞానంకు కూడా రజిని కొత్త ఇంటిని అందించిన విషయం తెలిసిందే. ఇక మళ్ళీ ఇప్పుడు మరో పదిమందికి సొంత గూటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తలైవా దర్బార్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మురగదాస్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి భారి స్థాయిలో రిలీజ్ కానుంది. అలాగే శివ డైరెక్షన్ లో త్వరలో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.


