న్యూ ఏజ్ యాక్షన్ మూవీగా ‘ఖైదీ’ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది – యాంగ్రీ హీరో కార్తీ

0
1232

యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’, ‘నా పేరు శివ’, ‘ఖాకీ’ ‘ఊపిరి’ ఇలా ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులని అలరిస్తూ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ఏర్పరచుకున్నారు యాంగ్రీ హీరో కార్తీ. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మిస్తున్న డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్ స‌మ‌ర్పిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25నప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరో కార్తీ ఇంటర్వ్యూ…

‘ఖైదీ’ కథ ఎంచుకోవడానికి కారణం?
– లోకేష్ కనకరాజ్‌ షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇండస్ట్రీ కి వచ్చారు. ఫస్ట్ మూవీ తోనే చాలా పెద్ద హిట్అందుకున్నారు. ఈ కథ చెప్పేటప్పుడే ఇదొక కొత్త ఐడియా డెఫినెట్ గా మీకు నచ్చుతుంది ఒకసారి వినండి అని చెప్పారు. పదేళ్ల పాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జైలులోనే ఉండిపోయిన ఓ ఖైదీ కథ ఇది. తనకు పదేళ్ల వయసున్న పాప కూడా ఉంటుంది. ఆ పాప ఎక్కడ ఉందో, ఎలా ఉందో కూడా తెలియదు. జైలు నుంచి బయటపడిన ఖైదీ ఆ పాపని వెతుక్కుంటూ చేసిన నాలుగు గంటల ప్రయాణం ఇది. రాత్రి పూట మాత్రమే చిత్రీకరణ చేశాం. సినిమా అంతా యాక్షన్‌ మూడ్‌లో ఉంటుంది. పైగా తండ్రీ కూతుర్ల మధ్య భావోద్వేగాలు నన్ను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు కనకరాజ్‌ కథ చెప్పినట్టే తెరపై చూపించారు. పది సంవత్సరాలు కూతురిని చూడని తండ్రి క్యారెక్టర్ అంటే నాకు కూడా పెర్ఫామెన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనిపించింది.

మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన సందర్భమేమిటి?
– నాకు ఒక కూతురు ఉండడం వల్ల నాన్నగా నటించడం ఈజీ అయింది. నేను గతంలో ‘విక్రమార్కుడు’ మూవీని తమిళ్ లో రీమేక్ చేసేటప్పుడు నాకు ఒక కూతురు ఉంటే ఇలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకొని నటించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి సమస్య ఏమి లేదు కాబట్టి అంతా హ్యాపీగానే జరిగింది.

ట్రైలర్ లో డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది కదా! సినిమాలో మరిన్ని డైలాగ్స్ ఉన్నాయా?
– తప్పకుండా ఉన్నాయి. ట్రైలర్ లో చూపించింది చాలా తక్కువ రేపు సినిమాలో డైలాగ్స్ కి మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. ప్రతి సీన్ ఫ్రెష్ గా ఉంటుంది. సినిమా ఒక న్యూ ఏజ్ యాక్షన్ ఫిలింలా ఉంటుంది, కానీ నా క్యారెక్టర్ మాత్రం మాస్ గా ఉంటుంది. ఇదొక యూనిక్ కాంబినేషన్. అతను ఎవరు? అతని గతం ఏంటి అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

‘ఖైదీ’ చిరంజీవిని స్టార్‌గా మార్చిన సినిమా. అదే పేరుతో మీ సినిమా రావడం ఎలా అనిపిస్తుంది?
– ఇది కావాలని పెట్టింది కాదు. ఈ కథకు ఈ టైటిల్‌ సరిగ్గా సరిపోతుంది. ఖైదీ, ఖైది నెం.786, ఖైదీ నెం.150… ఇలా చిరంజీవిగారు చేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. అందుకే మా సినిమాకి ‘ఖైదీ’ అని పేరు పెట్టగానే ఓ ప్రత్యేక దృష్టితో చూడడం మొదలెట్టారు. మేం మంచి సినిమా తీశాం. ఆ పేరు చెడగొట్టలేదన్న నమ్మకం ఉంది. అలాగే చిరంజీవి గారి ‘ఖైదీ’ సినిమా ఇదే నెలలో విడుదలై బిగ్ హిట్ అయింది. మా సినిమా కూడా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.

మ్యూజిక్ గురించి?
– ఇలాంటి ఒక మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నపుడు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోను ఒక ఇంగ్లీష్ సాంగ్ పెట్టడమనేది న్యూ థాట్. సామ్‌ ఒక హాలీవుడ్ మూవీలాగే మ్యూజిక్ ఇచ్చారు. మాములుగా ఇలాంటి సినిమా రెండు గంటలే ఉంటుంది. కానీ కాన్ఫిడెంట్ గా 2-20 పెడుతున్నామంటే తప్పకుండా సరిపోయేంత థ్రిల్ ఉన్న కంటెంట్ ఉంది అర్ధం.

ఖాకి సినిమా విజయం ఇలాంటి సినిమాలు చేయడానికి ధైర్యం ఇచ్చింది అనుకోవచ్చా?
– అలా అనేం లేదండి. తెలుగులో కూడా కొత్త కొత్త కథలతో థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి, ‘అర్జున్ రెడ్డి’, నుండి అడవి శేష్ స్టైలిష్ థ్రిలర్ ‘ఎవరు’ కూడా మంచి సక్సెస్ సాధించాయి. అందులోను డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికీ దగ్గరఅయింది. ఇలాంటి సందర్భంలో ‘ఖైదీ’ లాంటి సినిమా చేసే అవకాశం ఒక్కసారే వస్తుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే టప్పుడు కూడా ఇలాంటి సినిమాలు చేయాలి అనుకున్నాను. సాంగ్స్‌, రొమాన్స్‌ లేకుండా కేవలం యాక్షన్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉండే డిఫరెంట్‌ మూవీ ఇది.

ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి రీసర్చ్ చేశారు?
– కొంతమంది ఖైదీలను కలుసుకుని మాట్లాడాను. వాళ్లు చాలా కొత్త విషయాలు చెప్పారు. ఎప్పుడూ తెల్లని దుస్తుల్నే చూస్తుంటారు కదా.. వాళ్లకు రంగులు కనిపిస్తే చాలా సంతోషపడిపోతారట. ఓ కుక్కని చూసినా వాళ్ల ఆనందం రెట్టింపు అవుతుందట. ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. చేయని తప్పుకి పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఖైదీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? తను ఎలాంటి విషయాలకు స్పందిస్తాడు? అనే విషయంలో చాలా కసరత్తు చేసి నటించాను.

ఒక స్టోరీ సెలక్షన్ అప్పుడు తెలుగు ఆడియన్స్ కి దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేస్తారా?
– అందరూ ఆడియన్సే కదండీ, అలా ఏం లేదు కానీ ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకుంటాను. అంతేకాని అలా ప్లాన్ చేసి సెలెక్ట్ చేస్తే వెరైటీ చేయడం చాలా కష్టం.

ఓ సినిమా విడుదలయ్యాక ఫలితం గురించి విశ్లేషణ చేస్తారా?
– ఎక్కువ ఆలోచిస్తే బుర్ర పాడవుతుంది. అందుకే పెద్దగా పట్టించుకోను. ‘నేను ఎలాంటి సినిమాలు చేస్తే మంచిది’ అని ఓ రిక్షావాలాని ఓసారి అడిగాను. ‘మీకు నచ్చిన సినిమా చేయండి చాలు. మాకు నచ్చుతుందా, లేదా? అని ఆలోచించకండి. మీకు నచ్చితే, మాక్కూడా నచ్చుతుంది’ అన్నారు. ఆ సలహా నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి అదే పాటిస్తున్నా.

సినిమా మొత్తం నైట్ షూట్ చేశారా?
– అవునండీ! మొత్తం 60 రాత్రులు షూట్ చేశాం. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ హీరోవిజయ్ గారితో సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకూ నేను పని చేసిన అందరూ టాలెంటెడ్ డైరెక్టర్స్.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– జీతూ జోసెఫ్ గారితో ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ చేస్తున్నాను. చాలా మంచి కథ. అంటూ ఇంటర్వ్యూ ముగించారు యాంగ్రీ హీరో కార్తీ.

దసపల్లా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here