నాని, సుధీర్ బాబుల ‘వి’ మూవీ శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జెమిని టివి..

0
480
నాచురల్ స్టార్ నాని, యువ హీరో సుధీర్ బాబుల కాంబినేషన్లో సెన్సేషనల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్సకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా వి. నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల థాయిలాండ్ లో తాజా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.
బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో నాని ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ప్రసార హక్కులను తాము కొనుగోలు చేసినట్లు ప్రముఖ టెలివిజన్ మాధ్యమం జెమినీ టీవీ వారు కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here