మాస్క్ తో పవర్ఫుల్ ‘హీరో’

0
381

సక్సెస్ ఫెయిల్యూర్స్ అని తేడా లేకుండా కేవలం  మంచి గుణంతో కోలీవుడ్ జనాల అభిమానాన్ని సంపాదించుకున్న నటుల్లో శివ కార్తికేయన్ ఒకరు. తన కొత్త సినిమాకు సంబంధించిన స్పెషల్ లుక్ ని ఇటీవల రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ హీరో సరికొత్తగా హీరో అనే సినిమాతో రాబోతున్నాడు. మాస్క్ తో పవర్ఫుల్ మ్యాన్ లా కనిపిస్తున్న  ఆ స్టిల్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాకు హీరో అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

భయం లేని ఒక యోధుడు అక్రమార్కులపై పోరాటం చేసి సాధారణ జనాలకు ఏ విధంగా సహాయపడ్డాడు అనే ఒక మంచి సందేశంతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. యువ దర్శకుడు PS.మిత్రన్ ఈ యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ దర్శకుడు విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ సినిమాకు దర్శకత్వం వహించాడు. తెలుగులో ఆ సినిమా అభిమాన్యుడిగా రిలీజయ్యింది. ఇక మొత్తానికి రెండవ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసిన మిత్రన్ హీరో పోస్టర్ తో మంచి హైప్ క్రియేట్ చేశాడు.

సీనియర్ హీరో అర్జున్ అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు అభయ్ డియోల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. మాస్క్ లో కనిపిస్తున్న ఈ హీరో సూపర్ మ్యాన్ లో స్క్రీన్ పై ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా అని అభిమానుల్లో ఒక స్పెషల్ టాక్ మొదలైంది. వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న అనంతరం శివకార్తికేయ మంచి కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. మరి హీరోగా ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here