శ్రీదేవి బ్లెస్సింగ్స్ తో.. అజిత్ న్యూ మూవీ

0
429

కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో థలా అజిత్ మరో బిగ్ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల బాలీవుడ్ పింక్ రీమేక్ “నెర్కొండ పార్వఇ” సినిమాతో మంచి హిట్ అందుకున్న అజిత్ నెక్స్ట్ కార్ రేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఆ సినిమాను నేడు చెన్నై లో లాంచ్ చేశారు. పూజా కార్యక్రమాలతో  సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన బోణి కపూర్ శ్రీదేవి ఆశీస్సులతో అజిత్ తో మరో సినిమాని మొదలుపెడుతున్నట్లు ఎనౌన్స్ చేశారు.

నెర్కొండ పార్వఇ లో మధ్య వయస్కుడిగా కనిపించిన అజిత్ ఇప్పుడు యంగ్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే అజిత్ లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాకు “వెలిమై” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. వెలిమై అంటే బలం అని అర్థం.  నెర్కొండ పార్వఇ దర్శకుడు హెచ్.వినోద్ మరోసారి అజిత్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. శ్రీదేవి కోరిక మేరకు అజిత్ తో సినిమాను నిర్మించిన బోణి కపూర్ వెంటనే మరో సినిమాను హిట్ కాంబినేషన్ లో స్టార్ట్ చేయడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ని వీలైనంత త్వరగా మొదలుపెట్టి సినిమా డేట్ పై క్లారిటీ ఇవ్వాలని చిత్ర యూనిట్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటోంది. బోణి కపూర్ ఫిల్మ్ ప్రొడక్షన్ బే వ్యూ ప్రాజెక్ట్స్ LLP లో రూపొందుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here