ఈద్ కి సల్మాన్ న్యూ మూవీ ఫిక్స్.. దబాంగ్ + రాధే

0
511

ఒక్కసారి కమిటైతే.. నా మాట నేనే వినను’ అని తెలుగులో మహేష్ చెబితే హిందీలో ప్రభుదేవ సల్మాన్ ఖాన్ తో చెప్పించాడు. ఇప్పుడు నీరూపిస్తున్నాడు కూడా. సల్మాన్ – ప్రభుదేవా ఇద్దరు ఒక మాటకు కమిటై అభిమానులకు ఇచ్చిన కామిట్మెంట్ కి న్యాయం చేయడానికి సిద్దమయ్యారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన పోకిరి రీమేక్.. వాంటెడ్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక వచ్చే క్రిస్మస్ కి దబాంగ్ 3 తో రాబోతున్న విషయం తెలిసిందే.

ఇక ఆ తరువాత ఈద్ కి కూడా ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయాలని ఫిక్స్ అయ్యింది. దబాంగ్ 3 వర్కింగ్ తో ప్రభుదేవకు ఇంకాస్త దగ్గరైన సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఈద్ కోసం రాధే అనే మరో సినిమాను కూడా ఆ దర్శకుడితోనే చేయబోతున్నాడు. దబాంగ్ 3 + రాధే..మిక్స్ చేసి స్పెషల్ వీడియోతో ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ ఏనౌన్స్మెంట్ ను ఇచ్చారు. 2020 ఈద్ కి  మొదట్లో సల్మాన్.. సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో ఇన్షాల్లా సినిమాతో రావడానికి డిసైడ్ అయిన విషయం తెలిసిందే. కానీ ఆ ప్రాజెక్ట్ అనుకోని విధంగా క్యాన్సిల్ అయ్యింది.

దీంతో నెక్స్ట్ ఇయర్ ఈద్ కి సల్మాన్ సినిమాను మిస్ అవుతామేమో అని అభిమానుకు కొంత ఆందోళన చెందారు. కానీ వారికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే ఈద్ కి రావడం పక్కా అంటూ మాట ఇచ్చిన సల్మాన్ స్ట్రాంగ్ గా కమిటయ్యాడు. ఇక దబాంగ్ పనులు ఎండింగ్ కి వచ్చేసరికి ప్రభుదేవాతో మరో సినిమాను ఒకే చేయించుకున్నాడు. రాధే అనే టైటిల్ ని ఫిక్స్ చేయడంతో మాస్ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరి బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ తో రాబోతున్నా ఈ స్టార్స్ ఎలాంటి విజయాల్ని అందుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here