‘కాగితం పడవలు’ అందరికీ గుర్తుండిపోయే ప్రేమకథ. సెప్టెంబర్ 18న అందరూ థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను: సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో వర్ధన్
వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సాంగ్ లాంచ్ చేశారు.
సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో వర్ధన్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. కాగితం పడవలు.. ఒక కాలువులో ప్రయాణం చేయాలని అనుకున్నాం. తెలియకుండానే ఒక సముద్రంలోకి వచ్చేశాం. ఎన్నోసార్లు ఒడ్డుకు వద్దాం అనుకున్నాం. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడం చాలా కష్టం. డైరెక్టర్ తుకారాం గారు చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 18న థియేటర్స్‌లో కలుద్దాం.
దర్శకుడు తుకారాం మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మా సినిమాకి మా నిర్మాతలే హీరోలు. మా నిర్మాతలు లేకపోతే ఈ సినిమా ఇంత దూరం వచ్చేది కాదు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే మీ ప్రేమకథ మీకు గుర్తుకొస్తుంది. మీరందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.”
హీరోయిన్ కృష్ణప్రియ మాట్లాడుతూ: తెలుగులో ‘కాగితం పడవలు’ నా రెండో సినిమా. మా నిర్మాతలందరికీ థాంక్యూ. మా డైరెక్టర్ గారు చాలా ప్యాషన్‌తో సినిమా తీశారు. ఇందులో చాలా మంచి క్యారెక్టర్‌లో నటించాను. మా హీరోగారికి థాంక్యూ. సెప్టెంబర్ 18న సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు.
నిర్మాత అంజనప్ప మాట్లాడుతూ ఈ సినిమా కోసం టీమ్ చాలా కష్టపడింది. తుకారాం గారు చాలా అద్భుతంగా సినిమా తీశారు. అలాగే మా డీఓపీ గారి కష్టాన్ని కూడా మర్చిపోలేము. మా మేనేజర్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సెప్టెంబర్ 18న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరంతా సపోర్ట్ చేయాలి.
డీవోపీ రుద్ర సాయి మాట్లాడుతూ: కాగితం పడవలు’ ఒక ఎమోషన్ . అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. కంటెంట్ బాగున్న సినిమాలు ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా కచ్చితంగా చాలా బాగుంటుంది. సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను.
నటీనటులు: వర్ధన్, కృష్ణప్రియ
రచన & దర్శకత్వం: ఎంజీఆర్ తుకారాం
నిర్మాతలు: కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప
సంగీతం : AIS.నౌఫల్ రాజా
డీవోపీ: రుద్రసాయి
ఎడిటర్: జెస్విన్ ప్రభు
కాస్ట్యూమ్స్: కిరణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.హిమ బిందు
సాహిత్యం: రెహమాన్
పీఆర్వో: తేజస్వి సజ్జా



