హాట్ ఛార్మి: అదే అందం.. అదే ఫిట్ నెస్

0
787
హీరోయిన్స్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టడం అనేది రేర్ ఫీట్. ఆ దారిలో సీనియర్ హీరోయిన్ ఛార్మి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో ఆమె సాలిడ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ తో చార్మీ నెక్స్ట్ సినిమాలపై మరిన్ని జాగ్రత్తలు వహిస్తోంది. ఇక ఆమె యాక్టింగ్ కెరీర్ పై గతంలో ఒక షాకింగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది.
ఇప్పట్లో నటించకపోవచ్చని అన్సార్ ఇచ్చిన ఛార్మి  అవకాశాలు ఎన్ని వచ్చినా ఒప్పుకోవడం లేదట. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టినా బేబీ గ్లామర్ డోస్ మాత్రం తగ్గడం లేదు. అదే ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి నేత్రానందాన్ని కలిగిస్తోంది. పోస్ట్ చేసిన ప్రతి ఫొటోలో ఛార్మి తన అందంతో నెటిజన్స్ ని మరింత ఆకర్షిస్తోంది.
చూస్తుంటే మరోసారి హాట్ గ్లామర్ తో వెండితెరని వేడెక్కించే అవకాశం ఉందని ఆడియెన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎలా ప్రస్తుతం ఛార్మి పూరి టూరింగ్ టాకీస్ తో కలిసి రొమాంటిక్ సినిమాను నిర్మిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కొత్త సినిమాకు కూడా ఆమె వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది ఎండ్ లో ఆ సినిమా సెట్స్ పైకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here