దీపావళి బాక్స్ ఆఫీస్ బాంబ్స్.. కార్తీ VS విజయ్ క్లాష్

0
428

సినిమా ఇండస్ట్రీలో ఫెస్టివల్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే వాటి బజ్ మాములుగా ఉండదు. ఈ సారి కూడా అన్ని ఇండస్ట్రీలలో దీపావళిని టార్గెట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధానికి దిగాయి. ఎవరి సంగతి ఎలా ఉన్నా కోలీవుడ్ లో మాత్రం కలెక్షన్స్ కొట్లాట డోస్ పెరిగేలా కనిపిస్తోంది. కార్తీ – విజయ్ ల మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఈ ఇద్దరి హీరోల సినిమాలు దీపావళికి పేలబోతున్నాయి.
కార్తీ నటించిన ప్రయోగాత్మక చిత్రం ఖైదీ తో పాటు విజయ్ నటించిన బిగ్ బడ్జెట్ మూవీ బిగిల్ కూడా అక్టోబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. నిన్నటివరకు ఈ దీపావళికి ఎవరు ముందు వస్తారు అనే ఊహాగానాలు ఎన్నో వచ్చాయి. కానీ ఎవరు ఊహించని విధంగా ఇద్దరు ఒకేసారి రంగంలోకి దిగుతున్నారు. రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకమని చెప్పాలి. ఖైదీ సినిమాలో పాటలు రొమాన్స్ లేకుండా ఓన్లీ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ అంశాలు మాత్రమే ధట్టించారు.

ఇక మరోవైపు విజయ్ బిగిల్ స్పోర్ట్స్ డ్రామా కాన్సెప్ట్ తో రాబోతోంది. యాక్షన్ అండ్ ఎమోషన్ సాంగ్స్.. ఇలా అన్ని కమర్షియల్ యాంగిల్స్ ని దర్శకుడు అట్లీ కవర్ చేశాడు. ఇద్దరు హీరోలు ఎవరి స్థాయిలో వారు ఓపెనింగ్స్ ని అందుకుంటారని చెప్పవచ్చు. చూస్తుంటే రెండు సినిమాలకి దీపావళి బాక్స్ ఆఫీస్ వెలుగుల్ని నింపుతుందని తెలుస్తోంది. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ సౌండ్ తో కోలీవుడ్ దద్దరిల్లడం కాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here