ఒకే ఫొటోలో స్టార్ యాక్టర్స్ నవ్వుతు కనిపిస్తే చూసేవారికి కిక్కు మాములుగా ఉండదు. ఎన్నో సినిమాల్లో నటించిన బాక్స్ ఆఫీస్ హీరోలు ఇటీవల ఒక ఈవెంట్ ద్వారా సింగిల్ ఫ్రేమ్ లో దర్శనమిచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా వీరు ఫోటోకి స్టిల్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆ మూమెంట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇటీవల షారుక్ సౌదీ అరేబియాకు వెళ్లారు.
రియాద్ కింగ్ డమ్ సౌదీ అరేబియా లో జరుగుతున్న జాయ్ ఫారమ్ 2019 ఫిల్మ్ ఫెస్టివల్ కి షారుక్ స్పెషల్ గెస్ట్ గా వెళ్లారు. అక్కడ ప్రపంచంలోని ప్రముఖ స్టార్ సెలబ్రెటీలు ఒకేచోట దర్శనమిచ్చారు. ఇక ఇండియన్ సినిమాను ఎక్కువగా ఇష్టపడే జాకీ ఛాన్ కూడా షారుక్ ను ప్రత్యేకంగా కలుసుకున్నాడు. వీరికి తోడు హాలీవుడ్ స్టార్స్ ఆక్వామెన్ ఫెమ్ జాసన్ మోమోవా – వాన్ డామ్మే కూడా ఒకచోట చేరి మాట్లాడుకున్నారు.
అలాగే ఫోటోకి స్టిల్ ఇచ్చి వారి ఆనందాన్ని అభిమానులతో కూడా షేర్ చేసుకున్నారు. ఆ ఫొటో మూమెంట్ కి వరక్డ్ వైడ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం షారుక్ అట్లీ దర్శకత్వంలో కొత్త సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. డిసెంబర్ లో ఆ సినిమా పనులు మొదలుకానున్నట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.


