యంగ్ టాలెంటెడ్ హీరో రాకేష్ వర్రే “మాయలేడి” మూవీ నుంచి బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ‘సరిగమలే గుండె అంచుల్లో..’ రిలీజ్

0
16
Rakesh Varre Madhumitha Saracar In Melody Song ‘Sarigamale Gunde Anchullo’ from “Maya Lady”
Rakesh Varre Madhumitha Saracar In Melody Song ‘Sarigamale Gunde Anchullo’ from “Maya Lady”

యంగ్ టాలెంటెడ్ హీరో రాకేష్ వర్రే “మాయలేడి” మూవీ నుంచి బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ‘సరిగమలే గుండె అంచుల్లో..’ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా “మాయలేడి”. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు “మాయలేడి”తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే “మాయలేడి” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు “మాయలేడి” సినిమా నుంచి మేకర్స్ బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ‘సరిగమలే గుండె అంచుల్లో ..’ రిలీజ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ వినసొంపుగా కంపోజ్ చేసిన ట్యూన్ కు కృష్ణకాంత్ క్యాచీ లిరిక్స్ అందించారు. సింగర్ శిరీష భాగవతుల అందంగా పాడారు. ‘సరిగమలే గుండె అంచుల్లో..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘కలిసి అడుగులు వేయగా, ప్రతీది కనబడే కొత్తగా, ఉదయాల సూరీడే కొత్త రంగులో మారే తానుంటె తోడుగా, నడి జాముకే పోనే పోదుగా, మరి వాడి ఊసేంటో నీడలా, కలిసుంటే ఇలా సరిపోదేమో జన్మరా, సఖుడా ..’ అంటూ ప్రేమ జంట మాటల్లో చెప్పలేని భావాలను ఈ మెలొడీగా వ్యక్తీకరిస్తూ ఈ పాటను చిత్రీకరించారు.

ఇటీవల రిలీజ్ చేసిన “మాయలేడి” సినిమా గ్లింప్స్, టైటిల్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ దక్కింది. ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగే లవ్ స్టోరీని థియేటర్స్ లో చూడబోతున్న ఫీల్ ను ప్రేక్షకుల్లో ఈ గ్లింప్స్ క్రియేట్ చేసింది.

నటీనటులు -రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, తదితరులు

టెక్నీషియన్స్
——————–
మ్యూజిక్ – విశాల్ చంద్రశేఖర్
బ్యానర్ – క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ – రాకేష్ వర్రే
స్క్రిప్ట్, డైరెక్షన్ – ప్రశంకర్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here