హాలీవుడ్ మంచి పేరు సంపాదించిన టెర్మినేటర్ సిరీస్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఇక ప్రస్తుతం ఆ సిరీస్ లో రాబోతున్న ఆరవ సినిమా ‘టెర్మినేటర్ డార్క్ ఫేట్’ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఇంగ్లీష్ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ చేతులమీదుగా రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని తాజ్ వివంటాలో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ఆ సినిమా యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ సినిమాలో మెకంజీ డేవిస్, నటాలియా రేయిస్, గాబ్రియేల్ లూనా లతో పాటు యాక్షన్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ మరియు లిండా హామిల్టన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది…..!!


