బిగిల్ దర్శకుడితో షారుక్ ఫిక్స్

0
491

ఫైనల్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. గత కొంత కాలంగా షారుక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మౌనం పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే కింగ్ ఖాన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. మొత్తానికి కోలీవుడ్ యువ దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అతనెవరో కాదు.. విజయ్ తో వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న దర్శకుడు అట్లీ. జీరో సినిమా అనంతరం కొంత గ్యాప్ తీసుకుంటున్నట్లు చెప్పిన ఖాన్ అట్లీ తో తదుపరి సినిమాపై డిస్కర్స్ చేస్తున్నట్లు టాక్ వచ్చింది. ఐపీఎల్ మూడ్ లో అట్లీ ఈ బాలీవుడ్ హీరోతో కనిపించడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ వైరల్ అయ్యింది. ఇక మొత్తానికి అతని స్క్రిప్ట్ ని నమ్మి షారుక్ సినిమా చేయడానికి సిద్దమైనట్లు సమాచారం.

ఈ విషయంపై త్వరలో అఫీషియల్ ఎనౌన్న్మెంట్ వెలువడనుంది. డిసెంబర్ లో సినిమా పనులు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం దర్శకుడు అట్లీ విజయ్ బిగిల్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 180కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా 25మిళియన్ల వ్యూవ్స్ దాటేసి మంచి హైప్ క్రియేట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here