100 కోట్ల ధనుష్ అసురన్

0
6240

కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో ధనుష్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా చూపించాడు. సినిమా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగించే ధనుష్ ఇప్పుడు అసురన్ సినిమాతో అదే తరహాలో హైప్ క్రియేట్ చేసి మంచి ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్ రిలీజయిన్నప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో ఆడియెన్స్ ని తెగ ఎట్రాక్ చేస్తోంది.

ఇకపోతే సినిమా లేటెస్ట్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. అసురన్ 100 కోట్ల రెవెన్యూ సాధించింది. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రిలీజైన అనంతరం ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే నిర్మాతలు దాదాపు సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. ఇక ఇప్పుడు థ్రియేటికల్ కలెక్షన్స్ తో పాటు శాటిలైట్ టివి – డిజిటల్ – ఆడియో రైట్స్ ద్వారా సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది.

దీంతో చిత్ర నిర్మాతలు అలాగే డిస్ట్రిబ్యూటర్స్ చాలా వరకు సేఫ్ జోన్ లోకి రావడమే కాకుండా మంచి లాభాలను అందుకుంటున్నారు. ఈ సినిమా ద్వారా కథానాయకుడు ధనుష్ మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. వి క్రియేషన్స్ పై కలైపులి స్ థాను నిర్మించిన ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఇక ధనుష్ సరసన మంజు వారియర్ కథానాయికగా నటించగా జివి.ప్రకాష్ కుమార్ సినిమాకు సంగీతం అందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here