మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి, ఎన్నో అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించగా, మెగాస్టార్ సరసన నయనతార తొలిసారి హీరోయిన్ గా నటించారు. తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులు సహా, ఎందరో సినిమా ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక నేడు ఈ సినిమాను హైదరాబాద్, గుచ్చిబౌలి ప్రాంతంలో ఏఎంబి సినిమాస్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన ఫ్యామిలీతో కలిసి ప్రత్యేకంగా వీక్షించడం జరిగింది. అల్లు అర్జున్ రాకతో ఏఎంబి సినిమాస్ ప్రాంతమంతా ఎంతో సందడిగా మారిపోయింది. అక్కడి మేనేజ్మెంట్ వారు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కాగా అల్లు అర్జున్ మరియు ఆయన ఫ్యామిలీ సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి…!!