సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఫిల్మ్ వార్. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. స్టార్ హీరోలు హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ సినిమాలో నటిస్తుండడంతో సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది. ఇప్పటికే సినిమా పోస్టర్స్ టీజర్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే సినిమాలో యాక్షన్ సీన్స్ కోసమే ఏడాది పాటు కష్టపడాల్సి వచ్చిందని దర్శకుడు ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పాడు. సాధారణంగా హాలీవుడ్ సినిమాల్లో 4 యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. కానీ వార్ సినిమాలో ఎవరు ఊహించని విధంగా 7 యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కించినట్లు చెప్పాడు. టైగర్ జిందా హై ఫేమ్ పేర్వేర్జ్ షేక్ తో పాటు నలుగురు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ స్పిల్ హ్యూస్( డెత్ రేస్ ఫేమ్) పాల్ జెన్నింగ్స్(గేమ్ ఆఫ్ త్రోన్స్ ), సీ యంగ్ హో (ఏజ్ ఆఫ్ ఆల్ట్రోన్ ) సినిమా కోసం పనిచేసినట్లు చెప్పారు.


